దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కేజీఎఫ్-2′. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ మూవీని మే 30న విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘KGF-2’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది
Read More »TimeLine Layout
January, 2021
-
22 January
ఆలీ మూవీలో అచ్చిరెడ్ది,ఎస్వీ కృష్ణారెడ్డి
హాస్య నటుడు ఆలీ నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్ర ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. ఈ చిత్రంలో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ లో వీరు ముగ్గురూ పాల్గొన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి నటుడు ఆలీ.. ఈ ముగ్గురు కలిసి తీసిన యమలీల, ఘటోత్కచుడు, మాయలోడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Read More » -
22 January
అనారింజ తొక్కే కదా అని తీసి పారేయకండి !
తొక్కే కదా అని తీసి పారేయకండి ! అనారింజ పండు తొక్కలను నిత్యం మర్ధనా పింపుల్స్ మాయం అవుతాయి – అఆరెంజ్ తొక్క గాయాలు, ఇన్ఫెక్షన్ భాగాలపై రాసుకోవచ్చు అక్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి అజీర్ణ సమస్యలకు నారింజ తొక్కలోని ఫైబర్ ఎంతగానో మేలు చేస్తుంది ఆరెంజ్ తొక్కలోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు గుండె జబ్బులు, అల్జీమర్స్ డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా సాయపడతాయి.
Read More » -
22 January
మీకు మోకాళ్ల సమస్యలున్నాయా..?
ఈ మధ్య అన్ని వయసుల వాళ్లూ మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణం యుక్త వయసులో ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం. అయితే, ఈ నొప్పులు తగ్గించుకోవడానికి రోజూ ఎక్కువగా నడవాలట. అలాగని.. ఎగుడుదిగుడుగా ఉండే నేల మీద నడవకుండా ఉంటే మంచింది. అలాగే ప్రతీసారి ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా రోజూ వాకింగ్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన కీళ్లు ఫిట్ గా తయారవుతాయి.
Read More » -
22 January
తిరుపతిలో పోటీపై పవన్ క్లారీటీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
Read More » -
22 January
రాజకీయ వారసత్వం కాదు.. తెలంగాణ రాజకీయాలకు జవసత్వం ..!!
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. రాష్ట్రంలో స్వయం పాలన ను నిలబెట్టడానికి, అభివృద్ధి పథాన నడిపించడానికి , పటిష్టమైన నాయకత్వం అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలోంచే వర్తమాన తెలంగాణలో భవిష్యత్తు నాయకత్వం రూపుదిద్దుకుంటున్నది. ఆ క్రమంలోనే, యువమంత్రి కేటీఆర్ ను సిఎం కెసిఆర్ కొడుకుగానే కాకుండా, రేపటి తరానికి నాయకుడిగా రూపుదిద్దుకుంటున్న పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వున్నది. కేటీఆర్ నేడు ఈ స్థాయికి చేరుకోవడమనేది యేదో …
Read More » -
22 January
సింగరేణిలో కొలువుల జాతర
తెలంగాణలోని సింగరేణిలో కొలువుల జాతర మొదలయింది. మొదటివిడుతగా 372 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలయింది. సింగరేణిలో 651 పోస్టులను మార్చిలోపల భర్తీచేస్తామని సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రకటించిన రెండు వారాల్లోనే మొదటివిడుత భర్తీకి నోటిఫికేషన్ రావడం గమనార్హం. మిగతా పోస్టులకు దశలవారీగా నోటిఫికేషన్లను విడుదలచేస్తామని సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. తాజా నోటిఫికేషన్‌లో 7 క్యాటగిరీల్లో 372 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో 305 పోస్టులను లోకల్.. అంటే …
Read More » -
22 January
తెలంగాణలో పది పరీక్షల నిర్వాహణపై క్లారీటీ
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది. అయితే మే 17వ తేదీ నుంచి పది పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి, …
Read More » -
22 January
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. 1586 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,781 యాక్టివ్ కేసులున్నాయి.. చికిత్స నుంచి కోలుకుని 2,86,898 మంది డిశ్చార్జ్ అయ్యారని …
Read More » -
22 January
సీఎం కేసీఆర్ మరో నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా …
Read More »