Home / SLIDER / తెలంగాణలో పది పరీక్షల నిర్వాహణపై క్లారీటీ

తెలంగాణలో పది పరీక్షల నిర్వాహణపై క్లారీటీ

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయి. 9వ త‌ర‌గ‌తి నుంచి ఆపై త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు పాఠాలు బోధించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తారా? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది.

అయితే మే 17వ తేదీ నుంచి ప‌ది ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మే 26వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ఆ మ‌రుస‌టి రోజు నుంచి జూన్ 13వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

ఈ ప్ర‌తిపాద‌న‌ను పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌భుత్వానికి పంపింది. ఈ ఏడాది 70 శాతం సిల‌బ‌స్‌తోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.