Home / SLIDER / తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
Coronavirus or Flu virus isolated - Microbiology And Virology Concept

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు మృతి చెందారు.

దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. 1586 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,781 యాక్టివ్ కేసులున్నాయి..

చికిత్స నుంచి కోలుకుని 2,86,898 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 52 కరోనా కేసులు నమోదయ్యాయి.