Home / SLIDER / సింగ‌రే‌ణిలో కొలువుల జాతర

సింగ‌రే‌ణిలో కొలువుల జాతర

తెలంగాణలోని సింగ‌రేణిలో కొలు‌వుల జాతర మొద‌ల‌యింది. మొద‌టి‌వి‌డు‌తగా 372 పోస్టుల భర్తీకి గురు‌వారం నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌లయింది. సింగ‌రే‌ణిలో 651 పోస్టు‌లను మార్చి‌లో‌పల భర్తీ‌చే‌స్తా‌మని సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ప్రక‌టిం‌చిన రెండు వారా‌ల్లోనే మొద‌టి‌వి‌డుత భర్తీకి నోటి‌ఫి‌కే‌షన్‌ రావడం గమ‌నార్హం. మిగతా పోస్టు‌లకు దశ‌ల‌వా‌రీగా నోటి‌ఫి‌కే‌ష‌న్లను విడు‌ద‌ల‌చే‌స్తా‌మని సీఎండీ శ్రీధర్‌ ప్రక‌టిం‌చారు.

తాజా నోటి‌ఫి‌కే‌ష‌న్‌లో 7 క్యాట‌గి‌రీల్లో 372 పోస్టు‌లను భర్తీ చేయ‌ను‌న్నట్టు తెలి‌పారు. ఇందులో 305 పోస్టు‌లను లోకల్‌.. అంటే సింగ‌రేణి విస్త‌రించి ఉన్న ఉమ్మడి జిల్లా‌లైన కరీం‌న‌గర్‌, ఆది‌లా‌బాద్‌, వరం‌గల్‌, ఖమ్మా‌నికి చెందిన అభ్య‌ర్థు‌లకు కేటా‌యిం‌చారు. అన్‌ రిజ‌ర్వ్‌‌డ్‌గా కేటా‌యిం‌చిన 67 పోస్టు‌లకు రాష్ట్రం‌లోని అన్ని జిల్లా‌ల‌వారు అర్హులే. పూర్తి సమా‌చారం కోసం www. scclmines. com ను సంప్ర‌దిం‌చాలి.

అర్హు‌లైన అభ్య‌ర్థులు శుక్ర‌వారం మధ్యా హ్నం 3 నుంచి ఫిబ్ర‌వరి 4వ తేదీ సాయం త్రం 5 గంటల వరకు ఆన్‌‌లై‌న్‌లో దర‌ఖాస్తు చేసు‌కో‌వా‌లని సింగ‌రేణి సంస్థ తెలి‌పింది. దర‌ఖా‌స్తు‌తో‌పాటు అర్హ‌తల సర్టి‌ఫి‌కె‌ట్లను అప్‌‌లోడ్‌ చేయా‌లని పేర్కొ‌న్నది. ఎవరూ హార్డ్‌‌కా‌పీ‌లను పంపిం‌చ‌వ‌ద్దని స్పష్టం‌చే‌సింది. దర‌ఖాస్తు సమ‌యం‌లోనే ఎస్బీఐ లింకు ద్వారా రూ.200 ఫీజు చెల్లిం‌చాల్సి ఉంటుంది. అన్ని ఉద్యో‌గా‌లకు గరిష్ఠ వయో‌ప‌రి‌మితి 30 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ‌లకు మరో ఐదేండ్ల వరకు సడ‌లింపు ఉంటుంది.