తమిళనాడులో డీఎంకే పార్టీ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. తొమ్మిది జిల్లాల్లో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో డీఎంకేతో పాటు కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. అక్టోబర్ 6, 9 తేదీల్లో ఆ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ డీఎంకే కూటమి అన్ని పంచాయత్‌లను నెగ్గినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేపై ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ఇతర జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో …
Read More »TimeLine Layout
October, 2021
-
13 October
ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.’ …
Read More » -
13 October
మంత్రి కేటీఆర్‌ను కల్సిన డీఎంకే ఎంపీలు
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను డీఎంకే ఎంపీలు బుధవారం ఉదయం కలిశారు. నీట్‌పై సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను ఎంపీలు ఎల్ఎం గోవింద్, వీరస్వామి కలిసి కేటీఆర్‌కు అందజేశారు. కేంద్ర విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నామని డీఎంకే ఎంపీలు తెలిపారు. సీఎం స్టాలిన్ రాసిన లేఖ పట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల …
Read More » -
13 October
నవంబర్ 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన తో భారీ బహిరంగ సభ
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ …
Read More » -
13 October
పువ్వులను పూజించే గొప్ప పండగ బతుకమ్మ…
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ వారి …
Read More » -
13 October
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం
మల్లన్న సాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు 20 టీఎంసీల వరకు రావడంతో రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలోమండల ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాలేశ్వరం నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం నీళ్లతో రైతుల కన్నీళ్ళు తుడిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గారి కృషితో బీడు భూములు …
Read More » -
13 October
దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,33,42,901 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,51,189 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో 226 మంది మరణించగా, 22,844 మంది కరోనా నుంచి బయటపడ్డారు.ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నది. …
Read More » -
13 October
దుమ్ము లేపోతున్న పుష్ప శ్రీవల్లి Song
టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప చిత్రం ఒకటి. డిసెంబర్ 17న చిత్రం విడుదల కానుండగా, మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుదల చేస్తూ చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.ఇక ఇప్పుడు మూవీ నుండి …
Read More » -
12 October
దుమ్ము లేపుతున్న ‘పుష్ప’ ‘శ్రీవల్లి’ Song Promo
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. తాజాగా ఈ మూవీ నుంచి ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో రిలీజైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘పుష్ప ది రైస్’ డిసెంబర్ 17న 5 భాషలలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …
Read More » -
12 October
మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు
మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగునున్నాయి. ఆయన తనయుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సంజనా కలమంజేతో మహతి నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిగింది. ఈ నెల 24న చెన్నై టీ–నగర్‌లోని ద అకార్డ్ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 10.30 నిమిషాలకు మహతి, సంజనాతో ఏడడుగులు వేయనున్నారు. సంజనా కుటుంబ సభ్యులు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. వివాహం …
Read More »