Home / MOVIES / దుమ్ము లేపుతున్న ‘పుష్ప’ ‘శ్రీవల్లి’ Song Promo

దుమ్ము లేపుతున్న ‘పుష్ప’ ‘శ్రీవల్లి’ Song Promo

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. తాజాగా ఈ మూవీ నుంచి ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో రిలీజైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘పుష్ప ది రైస్’ డిసెంబర్ 17న 5 భాషలలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప రాజ్’, రష్మికల ‘శ్రీవల్లి’ లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల వచ్చిన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.

ఈ క్రమంలో అక్టోబర్ 13న ఈ మూవీ నుంచి ‘చూపె బంగారమాయేనే శ్రీవల్లి’.. అంటూ సాగే లిరికల్ సాగ్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సాంగ్ ప్రోమోను వదిలారు. ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించగా, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ మొత్తంశెట్టి మీడియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.