Home / MOVIES / దుమ్ము లేపోతున్న పుష్ప శ్రీవల్లి Song

దుమ్ము లేపోతున్న పుష్ప శ్రీవల్లి Song

టాలీవుడ్‌లో ప్రస్తుతం తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప చిత్రం ఒక‌టి. డిసెంబ‌ర్ 17న చిత్రం విడుద‌ల కానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుద‌ల చేస్తూ చిత్రంపై ఆస‌క్తిని పెంచుతున్నారు.

కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.ఇక ఇప్పుడు మూవీ నుండి ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి’ అనే సాంగ్ విడుద‌ల చేశారు.

ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు. చంద్రబోస్ పాటకు సాహిత్యం అందించారు. పాట శ్రోత‌ల‌ని తెగ ఆక‌ట్టుకుంటుంది. రానున్న రోజుల‌లో ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని అంటున్నారు.

శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా న‌టిస్తుంది. సునీల్‌, మ‌లయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.