Home / NATIONAL / త‌మిళ‌నాడు స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ స‌త్తా

త‌మిళ‌నాడు స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ స‌త్తా

 త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీ స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటింది. తొమ్మిది జిల్లాల్లో జ‌రిగిన గ్రామీణ ఎన్నిక‌ల్లో డీఎంకేతో పాటు కూట‌మి పార్టీలు విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశాయి. అక్టోబ‌ర్ 6, 9 తేదీల్లో ఆ ఎన్నిక‌లు జ‌రిగాయి.

పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ఎన్నిక‌ల సంఘం ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కానీ డీఎంకే కూట‌మి అన్ని పంచాయత్‌ల‌ను నెగ్గిన‌ట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేపై ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్న‌ది.

ఇత‌ర జిల్లాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 27 వార్డుల్లో డీఎంకే హ‌వా కొన‌సాగుతోంది. 140 జిల్లా పంచాయ‌తీ సీట్ల‌లో.. డీఎంకే పార్టీ 88 స్థానాల్లో విక్ట‌రీ న‌మోదు చేసిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం తెలిపింది. అన్నాడీఎంకే కేవ‌లం 4 స్థానాల్లో మాత్ర‌మే ఆధిక్యంలో ఉన్న‌ది. పంచాయ‌తీ యూనియ‌న్ వార్డుల్లోనూ డీఎంకే స‌త్తా చాటింది. 9 జిల్లాల్లోని 1381 వార్డుల్లో 300 సీట్ల‌లో డీఎంకే దూసుకువెళ్తోంది.