Home / Tag Archives: Aandhrapradesh

Tag Archives: Aandhrapradesh

సోషల్ మీడియా కి షాక్ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ

వంగవీటి రాధాకృష్ణ , కొడాలి నాని పై పోటీ చేస్తారని ఊదరకోట్టిన సోషల్ మీడియా .వంగవీటి రాధాకృష్ణ వైసీపి లోకి రానున్నారా…కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ గుడివాడ లో ప్రత్యేక సమావేశం….రాజకీయ భవిష్యత్తు పై చర్చించిన కొడాలి నాని, వంగవీటి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఒప్పించి మీత్రుడు వంగవీటి రాధాకృష్ణ ను వైసీపి పార్టీ లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం మంత్రి కొడాలి నాని చేస్తారా..ఈరోజు జరిగిన కొడాలి ,వంగవీటి …

Read More »

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం

ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.

Read More »

సుప్రీం కోర్టుకు RRR

బెయిల్ కోసం వైసీపీ రెబల్ MP రఘు రామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ CID తనపై నమోదు చేసిన కేసులో.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు MP రఘురామరాజుకు గుంటూరులోని సీఐడీ కోర్టు.. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో జైలుకు తీసుకెళ్లకుండా, ఆస్పత్రికి తరలించాలని సూచించింది.

Read More »

బాబుపై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్రంలోని గుంటూరులో కేసు నమోదైంది. న్యాయవాది అనిల్కుమార్ ఫిర్యాదుతో అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. కరోనాపై ప్రజలను భయపెట్టేలా మాట్లాడారని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలు పోలీస్టేషన్లో కేసు నమోదైంది.

Read More »

రేవంత్ అరెస్ట్ తప్పదా…?

తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన  ఓటుకు నోటు కేసు విచారణకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టు హెచ్చరించింది. నిన్న విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉదయ్ సింహ హాజరుకాగా, పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో వీలైనంత వేగంగా విచారణ చేపట్టాలని పేర్కొంది

Read More »

అప్పుడు తండ్రి ఇప్పుడు తనయుడు!

రాయలసీమ ప్రాంతం నుంచి ఎందరో అవిభజిత, విభజిత రాష్ట్రాన్ని పాలించారు. నిత్యం కరువుతో అల్లాడే ఆ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకున్నామని హడావిడి చేశారు. అయితే వారిలో ఆ ఇద్దరే ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారు. ఒకరు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. మరొకరు ఆయన తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఈ ప్రాంతం రాజకీయంగా ఎంతో అండగా నిలిచింది. …

Read More »

ఏపీలో ఈఎస్ఐ స్కాం కలవరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణలో ఏసీబీ జోరు పెంచింది. మాజీ మంత్రి పితాని పీఎస్ మురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. పితాని కొడుకు సురేష్ కోసం గాలింపు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సురేష్ ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను మురళి, …

Read More »

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

ఏపీ మాజీ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలో తాత్కాలికంగా మార్చిన దశలో తన పట్ల అయ్యన్న అనుచితంగా మాట్లాడారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్‌ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట …

Read More »

చంద్రబాబుపై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారు. భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు …

Read More »

బాబు నిర్వాకం.. విశాఖకు శాపం

విష వాయువు లీకేజీతో 12 మందిని పొట్టన పెట్టుకున్న ఎల్‌జీ పాలిమర్స్‌కు ఊపిరి పోసిందెవరు? అసలు ఆ సంస్థకు మొదటి నుంచి అండగా నిలిచిందెవరు? కంపెనీ విస్తరణకు సహకారాలు అందించిన వారెవరు? అడ్డగోలుగా ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు? ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పూర్వాపరాలు, భూభాగోతాలు పరిశీలిస్తే.. పై ప్రశ్నలన్నింటికీ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమవుతోంది. జనావాసాల మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీ విస్తరణ, …

Read More »