కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.
అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.