తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది.
తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో త్వరలో తమకు కార్డులు అందుతాయని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు.