Home / Tag Archives: Allola Indrakaran Reddy

Tag Archives: Allola Indrakaran Reddy

మొక్కలు నాటిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

 వజ్రోత్సవాల్లో భాగంగా  ఈ రోజు ఆదివారం  తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇవాళ ఒక్కరోజే 75 లక్షల మొక్కలు నాటుతున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ బొటానికల్‌ గార్డెన్‌లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని  ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.గతంలో …

Read More »

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేదపండితులు, ఆలయ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Read More »

యోగాతో శరీరానికి ఎంతో మేలు

ప్రతి రోజూ మనం  చేసే యోగాతో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో నిర్వహించిన పాదయాత్రలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా …

Read More »

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సీయం కేసీఆర్ నేతృత్వంలొ తెలంగాణ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద్విచ‌క్ర వాహ‌నంపై మున్సిపాటిలోని రాంబాగ్, నాయుడి వాడలో ప‌ర్య‌టించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల …

Read More »

రాష్ట్ర ప్రజ‌ల‌కు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి రాష్ట్ర ప్రజ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్‌లోని శాస్త్రిన‌గ‌ర్ ఉన్న తన క్యాంప్ కార్యాల‌యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ప్రస్తుతం …

Read More »

వనజీవి రామయ్య ఆరోగ్యంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా

పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఆరోగ్యంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. వనజీవి రామయ్య కుమారుడు కనకయ్యతో ఫోన్లో మాట్లాడిన మంత్రి..రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కాగా, బుధవారం ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్‌పై వెళ్తున్న రామయ్య రోడ్డు దాటుతుండగా …

Read More »

రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలా?: ఇంద్రకరణ్‌రెడ్డి

యాదాద్రిలో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించాను. భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యూకాంప్లెక్స్‌లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం.. వాష్‌ రూమ్స్‌లో సౌకర్యాలు, చలువ పందిళ్లు తదితర అంశాలపై చర్చించారు. రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చిన్నచిన్న సమస్యలను కూడా పెద్దవి చేసి చూపెట్టే ప్రయత్నాలు …

Read More »

ముస్లిం మైనార్టీల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగ‌ళ‌వారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌర‌స్తా వ‌ద్ద ఈద్గాలో ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లింల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుంద‌ని అన్నారు. అన్ని మ‌తాల వారిని స‌మానంగా గౌర‌విస్తూ, వారి శ్రేయ‌స్సు కోసం …

Read More »

నేడు ఢిల్లీకి న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుక్ర‌వారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భ‌వ‌న్ లో జ‌ర‌గ‌నున్న న్యాయ స‌ద‌స్సులో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన‌నున్నారు. సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి ప‌లు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్ జ్యూడిషీయల్ ఇన్ఫ్రాస్టక్టర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో …

Read More »

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన  నల్లగొండ జిల్లా నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఈ రోజు గురువారం రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డ నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవలే ఎమ్మెల్యే తండ్రి నర్సింహ  అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో ఈ రోజు  గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి  లింగయ్య ఇంటికి చేరుకున్న మంత్రి ముందుగా నర్సింహ …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar