దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందిస్తున్న ప్రభుత్వం తమదని వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులు వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘సామాజిక న్యాయం’ అనే పేరుతో …
Read More »వైసీపీ రాజ్యసభ టికెట్లు ఫైనల్.. అభ్యర్థులు వీళ్లే..
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం కల్పించారు. అనూహ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను వైసీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్‌రెడ్డికి ఆ పార్టీకి అధినేత, సీఎం జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్‌ను ప్రారంభించి గోదావరి, కృష్ణా వాటర్‌ను ముందే విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల నవంబర్‌లో తుపాను వచ్చే నాటికి పంట చేతికి వస్తుందని మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేసి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. గోదావరి డెల్టాకు …
Read More »కడుపుమంటతోనే టీడీపీ అనవసర రాద్ధాంతం: సజ్జల
రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కడుపుమంటతో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలే ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఓడిపోయిన టీడీపీ నేతలను గడపగడపకు పంపాలని.. ధైర్యం ఉంటే వాటన్నింటినీ వీడియో తీసిపెట్టాలని సజ్జల సవాల్ …
Read More »ముంబయిలో శ్రీవారి ఆలయానికి రూ.500కోట్ల స్థలం..
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. నడక దారి భక్తులకి దివ్యదర్శనం టికెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం, పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల …
Read More »టీడీపీ వాళ్లే నాపై దాడి చేయించారు: వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
జి.కొత్తపల్లిలో వైసీపీ నేతలు తనపై దాడి చేయలేదని..టీడీపీ వాళ్లే వెనకుండి దాడి చేయించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. జి.కొత్తపల్లిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. వారి మధ్య వివాదాన్ని రాజీ చేసినట్లు చెప్పారు. వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. హత్యకు గురైన గంజి …
Read More »టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లు వద్దు: జగన్
యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ టీలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని జగన్ అభిప్రాయపడ్డారు. టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లకు అవకాశం లేదని.. సమర్థులు, టాలెంట్ ఉన్నవారినే తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించిన టీచింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో …
Read More »ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ సర్వే చేయించారు: కొడాలి నాని
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌తో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని జగన్ ఆదేశించారన్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను తిరిగి సమస్యలను అక్కడి బుక్‌లో రాయాలని.. వాటిని తాను పరిష్కరిస్తానని …
Read More »సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కమిటీ
సీపీఎస్‌రద్దు అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, సీఎస్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం.. పలుచోట్ల నిరసనలు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి …
Read More »సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం
సీపీఐ నేత నారాయణ ఇంట పెద్ద విషాదం చోటు చేసుకుంది. నారాయణ సతీమణి గారైన శ్రీమతి వసుమతి అనారోగ్యంతో ఈరోజు ఏపీలోని తిరుపతిలో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వసుమతి. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని వారు ప్రకటించారు.
Read More »