Home / Tag Archives: andhrapradesh (page 30)

Tag Archives: andhrapradesh

ఏపీలో అవినీతి లేదు-సీఎం జగన్

ఏపీలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి అవినీతికి చోటు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.సీఎం జగన్ మాట్లాడుతూ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తరుణంలో ఎలాంటి అవినీతి జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,పించన్ అందాలని ఆదేశించారు.ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండా రేషన్ కార్డులను తొలగించవద్దు. దరఖాస్తులను తిరస్కరించవద్దు అని సూచించారు .తొమ్మిది నెలల్లోనే గత ఎన్నికల్లో …

Read More »

వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కావు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని,అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు విమర్శలు ఉన్న సంగతి విదితమే. దీనిపై ఒక ప్రముఖ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వూలో టీడీపీ నేత,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.ఆయన మాట్లాడుతూ ” వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కాదు.అప్పుడు అందరం కల్సి పార్టీని బతికించుకోవడానికి అలా …

Read More »

వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత

ఏపీ అధికారక పార్టీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతం శిద్ధాతో పాటు ఆయన …

Read More »

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మరో ఐదుగురికి కరోనా సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది.దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచారు. మరోవైపు సచివాలయంలోని వివిధ బ్లాకులను శానిటైజ్ చేయిస్తున్నారు.

Read More »

ఏపీలో కరోనా రోజుకో రికార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దూకుడుకు అడ్డుకట్ట పడటం లేదు. గత మూడురోజుల నుంచి 80కి తక్కువ కాకుండా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 82 కేసులు వెలుగు చూశాయి. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 1,259కి చేరింది. రాష్ట్రంలో మొదటి 603 కేసులు నమోదు కావడానికి 38రోజులు పట్టగా ఆ తర్వాత 656 కేసులు కేవలం 10రోజుల్లోనే వెలుగు చూశాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరో 17మంది …

Read More »

అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం

ఏపీలో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. కళ్యాణదుర్గం – రాయదుర్గం ప్రధాన హైవే రోడ్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు

Read More »

కర్నూల్ నుండి పాలమూరుకి కరోనా ముప్పు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి తెలంగాణకు కరోనా వ్యాప్తి చెందుతున్నది. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్‌ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్‌ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్‌ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్‌ …

Read More »

కొత్త దరఖాస్తుదారులకూ రేషన్‌

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఎవరైతే ఇప్పటివరకు రైస్‌కార్డు లేకుండా కొత్తగా కార్డుకోసం దరఖాస్తు చేసుకొన్నారో వారిలో అర్హులకు సరుకులు పంపిణీ చేయాల్సిందిగా జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఆరు అంచెల మూల్యాంకనం చేయాలన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిందిగా తెనాలి సబ్‌ కలెక్టర్‌, నాలుగు డివిజన్ల ఆర్డీవోలు, తమసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్‌లు, సీఎస్‌డీటీలను జేసీ ఆదేశించారు.

Read More »

4వ స్థానంలో ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు చెలరేగిపోతుంది.ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. పది లక్షల జనాభాకుగాను ఏపీ 331మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 16,555పరీక్షలు చేసింది.ఈ జాబితాలో రాజస్థాన్ (549),కేరళ (485),మహారాష్ట్ర (446)లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని పొందుపరచలేదు.ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య …

Read More »

వైసీపీ నేత మృతి

ఏపీలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.చంద్రమౌళి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. 2019 శాసనసభ ఎన్నికల్లో అనారోగ్యానికి గురై ప్రచారానికి వెళ్లనప్పటికీ ఆయన కుప్పం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి నార్సింగిలోని స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat