ఏలూరు జిల్లాలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం అందజేయనుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున పరిహారం అందిస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోరస్‌ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చాలా బాధాకరమని.. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. అవసరమైతే ఫ్యాక్టరీని …
Read More »ఏపీలో ఘోర రైలు ప్రమాదం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి.శిగడాం బాతువ రైల్వేస్టేషన్ల మధ్య ఘోర ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఐదుగురు చనిపోయారు. విశాఖ నుంచి గౌహతి వెళ్తున్న రైలు సిగ్నల్ లేక నిలిచిపోయింది. ప్రయాణికులు దిగి పక్క ట్రాక్పై నిల్చున్నారు. ఆ ట్రాక్పై కోణార్క్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు అందిస్తున్నారు.
Read More »ఫ్యాన్స్‌కి చిరు ‘ఆచార్య’ సర్‌ప్రైజ్
ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈనెల 29 ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5.49 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్‌ను ఎప్పటిలాగే యూట్యూబ్‌లోనే కాకుండా ఏకకాలంలో 152 థియేటర్లలోనూ రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులోని మొత్తం 152 థియేటర్లలో …
Read More »Ap నూతన మంత్రి వర్గం.. వీళ్లకే అవకాశం
ఏపీలో రాజీనామా చేసిన 24మంత్రుల స్థానంలో ఇవాళ సాయంత్రానికి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై స్పష్టత రానుంది. రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిట్టిబాబు, కారుమూరు నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, జోగి రమేష్, రక్షణనిధి, విడదల రజనీ, మేరుగ నాగార్జున, కాకాని గోవర్ధన్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాస్, శిల్పా చక్రపాణి, జొన్నలగడ్డ పద్మావతికి పదవులు దక్కుతాయనే ప్రచారం నడుస్తోంది.
Read More »ఎవరెన్ని చేసినా నా వెంట్రుక కూడా పీకలేరు: జగన్ ఫైర్
రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు మారాయని.. అందుకే విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని చెప్పారు. నంద్యాలలో ‘జగననన్న వసతి దీవెన’ రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదును జమ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. గవర్నమెంట్ స్కూళ్లలో చేరికల కోసం ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్‌లు ఇస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా …
Read More »ఏపీలో మరో కొత్త జిల్లా?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కొత్త జిల్లాల్లో పాలన అమల్లోకి వచ్చింది. పలుచోట్ల ప్రజల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఒకట్రెండు చోట్ల ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏపీ …
Read More »గంటకు పైగా ప్రధాని మోడీ- సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభించిన కొత్త జిల్లాలు, ఇతర అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం నిధులు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై మోడీతో జగన్ చర్చించినట్లు సమాచారం. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై మోడీ దృష్టికి …
Read More »గుడిలో దొంగతనం.. ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోయాడు!
అమ్మవారి గుడిలో చోరీకి వెళ్లిన దొంగ అక్కడే ఇరుక్కుపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ గుడి ఉంది. కంచిలి పట్టణానికి చెందిన పాపారావు అనే యువకుడు ఈ తెల్లవారిజామున దొంగతనానికి గుడి వద్దకు వెళ్లారు. గుడిలో ఓ కిటికీ నుంచి లోనికి ప్రవేశించాడు. అమ్మవారి వెండి వస్తువులు తీసుకుని తిరిగి అదే కిటికీ నుంచి …
Read More »ఆ సమయంలోపు రాజధాని నిర్మాణం పూర్తికాదు: ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధాని అమరావతి అంశంలో సీఎస్ సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈనెల 3వ తేదీలోపు రైతులకు ఇచ్చిన స్థలాల్లో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ అఫిడవిట్ సమర్పించారు. మొత్తం 190 పేజీల అఫిడవిట్‌ను కోర్టులో అందజేశారు. ఆ అఫిడవిట్ ప్రకారం హైకోర్టు నిర్దేశించిన గడువులోపు రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. రాజధాని …
Read More »చంద్రబాబు అలా గెలిస్తే నేను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా
మంత్రి పదవులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయం తమకు శిరోధార్యమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తమకు పదవులు ఉన్నా.. లేకపోయినా జగన్‌తోనే ఉంటామని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎంగా జగనే ఉంటారని నారాయణస్వామి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత జగన్ ప్రధాని కూడా అవుతారని వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై …
Read More »