Home / Tag Archives: attack

Tag Archives: attack

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై బీజేపీ నేతలు దాడి

మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆందోళ్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి యత్నించారు. వారిని నిలువరించిన పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడినట్లు తెలుస్తోంది.

Read More »

ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం

ఏపీలో గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు గురువారం రాత్రి దాడికి యత్నించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ కారులో బయల్దేరగా.. ఎదురుగా వచ్చిన పూర్ణచంద్రరావు తన బైక్‌ను అడ్డుపెట్టి అసభ్య పదజాలంతో దూషించాడు. ఎవరని ప్రశ్నించగా దాడి చేసేందుకు మీదకు రావడంతో భద్రతా …

Read More »

హీరోయిన్ పై దాడి

క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్య‌క‌ర్త‌లం అంటూ ప‌దిమంది యువకులు దాడి చేశారు. బెంగ‌ళూరులోని ప‌బ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో క‌లిసి వ‌ర్కవుట్స్ చేస్తున్న క్ర‌మంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌బ్లిక్ పార్క్‌లో అసభ్య‌క‌ర‌మైన దుస్తులు ధ‌రించి ఇలా చేయ‌డం ఏంటి అని మంద‌లించ‌డంతో ఈ వివాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌తి రోజు పార్క్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న సంయుక్త‌పై ఎవ‌రో ఫిర్యాదు చేయ‌డంతో ఆ యువ‌కులు వ‌చ్చినట్టు స‌మాచారం. సంయుక్త‌పై …

Read More »

స్థానిక సంస‌్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకం ఎన్నికల అధికారిపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులను పన్నుతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేలా ప్రత్యర్థులను రెచ్చగొట్టి హింసాత్మక ఘటనలు జరిగేలా చేసి వైసీపీపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. విజయవాడలో ఆర్వో సెంటర్ వద్ద వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేసిన సంఘటన మరువక ముందే…అనంతపురంలో మరో ఘటన జరిగింది. జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. తాడిపత్రిలో జేసీ …

Read More »

తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి ఓవరాక్షన్… చుక్కలు చూపించిన వైసీపీ కార్యకర్తలు..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం కానీ మావాళ్లు కానీ పోటీ చేయడం లేదని ప్రకటించిన   జేసీ దివాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నానా హంగామా చేశాడు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జేసీ బ్రదర్స్ మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ మధ్య …

Read More »

విజయవాడలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడులు…తీవ్ర ఉద్రికత్త..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు…మా వాళ్లను నామినేషన్లు వేయకుండా వైసీపీ అరాచకం చేస్తుందంటూ..చంద్రబాబు గత రెండు రోజులుగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడు. అయితే పుంగనూరులో కాని, మాచర్లలో కాని జరిగిన ఘటనల వెనక తొలుత టీడీపీ శ్రేణులై వైసీపీ శ్రేణులకు దాడులు చేస్తే జరిగిన ప్రతీకార దాడులు తప్పా..కావాలని జరిగినవి కాదు..ఇక క్షేత్ర స్థాయిలో జరుతుంది వేరు..టీడీపీ, జనసేన కార్యకర్తలే వైసీపీ …

Read More »

శ్రీకాళహస్తిలో బరితెగించిన జనసేన కార్యకర్తలు.. వైసీసీ దళిత కార్యకర్తపై హత్యాప్రయత్నం..!

ఏమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ రాష్ట్రాన్ని మరో బీహార్‌లా మార్చేస్తున్నారని విమర్శించాడో కాని..మరుసటి రోజే జనసైనికులు బీహారీ గ్యాంగ్‌లా రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ..టీడీపీ, జనసేన పార్టీలు పథకం ప్రకారం హింసాకాండ రగిలిస్తున్నాయి. కావాలనే వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం..తర్వాత వైసీపీ నేతల దాడులు, అరాచకం అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మీడియా మందుకు వచ్చి ప్రభుత్వంపై బురద జల్లడం పనిగా …

Read More »

మాచర్లలో టీడీపీ నేతలను ఉరికించిన స్థానికులు..దాడి చేసింది కాల్‌మనీ బాధితుడేనా..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చురేపాలని కుట్రలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలలో గుంటూరు జిల్లాలోని మాచవరంలో నామినేషన్లు వేయడానికి వెళ్లగా వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరావు, మాజీ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్నలతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు 10 కార్లలో మాచవరానికి …

Read More »

నారా లోకేష్‌ సాక్షిగా..టీడీపీ నేతలు వీధిరౌడీల్లా, గూండాల్లా దాడులు

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం జరిగిన బలవంతపు భూసేకరణతో నష్టపోయి, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న రైతులు కొండ్రు రమేష్, మట్ట వసంతరావు, తోటకూర పుల్లపురాజు, బొమ్మిరెడ్డి సత్యనారాయణ, చిటికినెడ్డి పోశయ్య, కాజా ప్రభాకరరావు తదితరులు మంగళవారం మండలంలోని మునికూడలి గ్రామంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వారికి సంఘీభావంగా వైసీపీ మండల కన్వీనర్‌ పెదపాటి డాక్టర్‌బాబు, సత్యం రాంపండు, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకటరాజు, అంబటి రాజు …

Read More »

భర్తను చెప్పుతో కొడుతూ..కాళ్లతో తంతున్నా భార్య

ఓ శాడిస్టుకు భార్యతో పాటు ఆమె తరఫు బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సోమవారం డోన్‌ పట్టణ పోలీసుస్టేషన్‌ ఎదుట చోటుచేసుకుంది. వివరాలిలా.. డోన్‌ తారకరామనగర్‌కు చెందిన కావ్యకు గత డిసెంబర్‌ 7న అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అరవింద్‌తో వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచే ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. పైగా వాటిని వీడియో తీసేవాడు. దీంతో వారం క్రితం …

Read More »