ఎంత ప్రయత్నించినా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదు..ఆ మధ్య చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు జనాలు పోటెత్తారు..దీంతో లోకేష్ పాదయాత్ర సోదిలో లేకుండా పోయింది…పవన్ క్రేజ్ ముందు లోకేష్ పాదయాత్ర వెలవెలాపోయింది..దీంతో అప్రమత్తమైన చంద్రబాబు తన దత్తపుత్రుడిని బుజ్జగించి 3 నెలల పాటు షూటింగ్ ల పేరుతో వారాహి యాత్రను ఆపేయించాడు..ఇక పచ్చ మీడియా లోకేష్ పాదయాత్రకు ఎంత జాకీలు వేసినా లాభం లేకపోతుంది…దీంతో లోకేష్ కు చిర్రెత్తిపోయి బూతులకు దిగుతున్నాడు..మా అమ్మను అవమానించినవాడిని (తండ్రే కాదు..కొడుకు కూడా అధికారం కోసం నిస్సిగ్గుగా నందమూరి ఆడబిడ్డ పరువును బజారున పెడుతున్నారు,) వదిలిపెట్టను…వారితో ఉచ్చపోయించి…కట్ డ్రాయర్ల మీద రోడ్ల మీద తిప్పే బాధ‌్యత ఈ లోకేష్ ది అంటూ…మంగమ్మ శపథాలు చేస్తున్నాడు..అంతే కాదు…ఎక్కడకు వెళ్లినా..జగన్ ని సైకో సీఎం అంటూ…వైసీపీ ఎమ్మెల్యేలు సైకో ఎమ్మెల్యేలంటూ నోరుపారేసుకుంటూ తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టి నిరసన తెలుపుతున్న వైసీపీ శ్రేణులపై దాడులు చేయిస్తున్నాడు…అడ్డు వచ్చిన పోలీసులను కూడా రక్తాలు వచ్చేటట్లు తెలుగు తమ్ముళ్లు దాడులకు పాల్పడుతున్నారు.
తాజాగా భీమవరంలో జరిగిన పాదయాత్రలో సీఎం జగన్ తో పాటు, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పసుపు గూండాలు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ పచ్చమూకల దాడుల్లో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. దీంతో నారా లోకేష్ తో సహా…పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. భీమవరం ఘటనపై విచారణ జరిపిన పోలీసులు టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఈ విధ్వంసకాండ జరిగిందని గుర్తించారు. ఈ క్రమంలో 44 మంది యువగళం వలంటీర్లను అరెస్ట్ చేయగా, 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులపై కేసులు నమోదయ్యాయి. భీమవరం, ఉండి, వీరవాసరం మండలాల టీడీపీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 324, 332, రెడ్ విత్ 149 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మొత్తంగా తాము ఎన్ని రోడ్ షోలు, పాదయాత్రలు చేసినా..పచ్చ మీడియాతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎంత బద్నాం చేసినా.. ప్రజల్లో సీఎం జగన్ కు ఉన్న ఆదరణ తగ్గకపోవడంతో నిరాశ, నిస్పృహలకు లోనైన నారా తండ్రీ కొడుకులు తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టి…వైసీపీ శ్రేణులు, పోలీసులపై దాడులు చేయించి…అదిగో రాష్ట్రంలో అరాచకం జరుగుతోంది..శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయంటూ….జగన్ సర్కార్ ను ప్రజల్లో బద్నాం చేసే కుట్రలకు తెగబడుతున్నారు..వైసీపీ శ్రేణులు కూడా చంద్రబాబు, లోకేష్ లు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించి..జగన్ ప్రభుత్వం పచ్చ కుట్రలను చేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..మరి భీమవరం ఘటనలో పోలీసులు లోకేష్ గ్యాంగ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.