నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం.. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సుబ్రమణ్యం గతేడాది సెప్టెంబరులో కామర్స్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు. కాగా, పరమేశ్వరన్.. త్వరలో ప్రపంచ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read More »అలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లే వస్తాయి
దేశంలో 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీ చేస్తే లో బీజేపీని 100 కంటే తక్కువ సీట్లకే పరిమితం చేయొచ్చన్నారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. కాంగ్రెస్ దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని.. ఇందుకోసం ప్రతిపక్షాలను ఏకం చేయడమే తన లక్ష్యమని అన్నారు. బిహార్ లోని పూర్నియాలో …
Read More »రాజకీయాల నుండి సోనియా గాంధీ తప్పుకోవడం లేదా..?
కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత.. ఏఐసీసీ చీఫ్ శ్రీమతి సోనియా గాంధీ రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే సోనియా గాంధీ దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారంపై ఆ పార్టీ స్పందించింది. అయితే సోనియాగాంధీ అలా అనలేదని ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుమారి సెల్జా తెలిపారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రమే సంతోషంగా …
Read More »వచ్చేన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం
దేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు తమ కూటమి ప్రయత్నిస్తుందని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాక తొలిసారి మహాగర్ బంధన్ ర్యాలీని ఉద్దేశించి లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడారు.
Read More »నితీశ్‌కుమార్, ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. నితీశ్‌కుమార్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఆరోపించగా.. వయసు మీద ఉన్న ప్రశాంత్ కిషోర్ ఏదైనా మాట్లడగలడు అని నితీశ్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఇవాళ ట్వీట్ ద్వారా ప్రశాంత్ కిషోర్ మరోసారి నితీశ్ కుమార్‌ను …
Read More »దేశంలోని విపక్షాలన్నీ ఒప్పుకుంటే ఆయనే బలమైన ప్రధాని అభ్యర్థి..?.. ఎవరతను..?
దేశంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్..బీజేపీ దేశాన్ని ఆగం పట్టిస్తున్నాయి. గతంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పాలనతో ఆగమైన దేశాన్ని తాజాగా గత ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు డెబ్బై ఐదేండ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని ఇటు పొలిటికల్ క్రిటిక్స్.. అటు విపక్ష పార్టీలైన ఆర్జేడీ,జేడీయూ,సీపీఐ,సీపీఎం,టీఎంసీ,టీఆర్ఎస్ ,ఎస్పీ,బీఎస్పీ,డీఎంకే లాంటి పార్టీలన్ని విమర్శిస్తున్నాయి. దేశంలో మూడో ప్రత్యామ్నాయం రావాలని.. అందుకు దేశంలోని పార్టీలన్నీ కల్సి రావాలని …
Read More »మోదీకి షాకిచ్చిన నితీశ్ కుమార్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ అధ్యక్షతన ఈరోజు ఆదివారం జరుగనున్న నీతిఆయోగ్ సమావేశాన్ని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ బహిష్కరించారు. తొలుత డిప్యూటీ సీఎంను సమావేశానికి పంపాలని భావించినా.. ఆ సమావేశానికి సీఎంలు మాత్రమే హాజరుకావాలని కేంద్రం కచ్చితంగా చెప్పడంతో బీహార్ తరఫున ఎవరూ వెళ్లట్లేదు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇటీవల నితీశ్ గైర్హాజరయ్యారు. కాగా, గత కొద్ది నెలలుగా వాయిదా పడుతున్న …
Read More »ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి నితీశ్ హాజరుకాలేకపోయారు.
Read More »రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ సీఎం .. నిజమా..?
బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రపతి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అయితే ఈ వార్తలను నితీశ్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.
Read More »