నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం.. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
1987 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సుబ్రమణ్యం గతేడాది సెప్టెంబరులో కామర్స్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు. కాగా, పరమేశ్వరన్.. త్వరలో ప్రపంచ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.