ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ చేసిందేమీ లేదంటూ సికింద్రాబాద్‌లో భారీ ఫ్లెక్సీ వెలిసింది. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ బహిరంగసభ జరగనుంది. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు. అయితే మోదీ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదంటూ టివోలీ థియేటర్ సిగ్నల్ సమీపంలో ఎవరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నోట్ల రద్దు, ప్రభుత్వసంస్థల అమ్మకం, అగ్నిపథ్, రైతు …
Read More »మహారాష్ట్రలో రేపే బలపరీక్ష – ఎవరు నెగ్గుతారు..?
మహారాష్ట్రలో మొత్తం 287 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అధికారం దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 144 స్థానాలు కావాలి. సీఎం ఉద్దవ్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి 120 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన రెబల్ వర్గం నేత షిండేకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ, స్వతంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వనుండగా షిండే వర్గానికి 167 మంది ఎమ్మెల్యే లు అవుతారు. మరి రేపు జరిగే బల పరీక్షలో ఎవరు …
Read More »ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన సుమారు 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »BJPకి TRS షాక్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో మరో 4 రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేందర్ మోదీ బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం చేసేందుకు బీజేపీకి తావు లేకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ చేసింది. వారం రోజుల వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 2300 మెట్రో పిల్లర్లతో పాటు అన్ని హోర్డింగ్లపై గత ఎనిమిదేండ్లుగా …
Read More »ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు- ఆధిక్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఏపీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 10వ రౌండ్ ఫలితాలు : వైసీపీ అభ్యర్థి …
Read More »రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసిన ముర్మూ
ప్రెసిడెంట్ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ ఈ రోజు నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ, కేబినేట్ మినిస్టర్స్‌తో పాటు మద్ధతు పార్టీల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ముర్మూ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు. ముర్మూను రాష్ర్టపతి అభ్యర్థిగా మొదట ప్రధాని ప్రతిపాదించారు. దీనికి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు, ఎన్డీఏ ఎంపీలు, రాష్ట్రాల్లోని బీజేపీ సీఎంలు, ఎంపీలు బలపరిచారు. వచ్చే నెల 18న ఈ ఎన్నిక …
Read More »శివసేనకు కొత్త ఏమి కాదు-గతంలో ఎన్ని సార్లు అంటే..?
మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేనకి చెందిన నేత, ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే ప్రమాదంలో ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు (37 …
Read More »ఇంతకీ పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నామన్న పవన్… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన …
Read More »కులపిచ్చోడు, మత పిచ్చోడు మనకొద్దు: కేటీఆర్
బీజేపీ నేతలు మాట్లాడితే విషం చిమ్ముతున్నారని.. హిందూ ముస్లిం మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉందని, ఎవరెన్ని కూతలు కూసినా పట్టించుకోవద్దని ప్రజలకి సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అనాలోచితమైన నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చేసిందని తీవ్రస్థాయిలో ఆయన …
Read More »ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్‌రావు
‘అగ్నిపథ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోతెలో పీహెచ్‌సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్‌ఎస్ చేయించిందంటూ బండి సంజయ్‌చేసిన ఆరోపణలపై హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …
Read More »