బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రపతి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అయితే ఈ వార్తలను నితీశ్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.
Read More »ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు
ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? దమ్ముంటే చూపించాలని ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు.ముస్తాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ దేశానికే దిక్సూచిగా మారుతున్నాయని …
Read More »ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ
ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాజకీయాలు అన్నంక గెలుపోటములు ఉంటాయని.. వాటన్నిటిని సమానంగా తీసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే పేదల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నికలు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుందని అన్నారు.సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ . కర్ణాటకలో వీళ్లు గెలవలేదు. కానీ పరిపాలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గెలవలేదు …
Read More »బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ వేడుకోవాలి
కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై కేంద్రాన్ని తూర్పారబట్టారు. రాష్ట్రం విద్యుత్ సంస్కరణలు అమలు చేయకుంటే.. నిధులు ఇవ్వకుండా పీఎఫ్సీ.. ఆర్‌ఈసీపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన మాటల్లోనే.. ‘మనకు ఉన్నటి వంటి నీటి ప్రాజెక్టుల్లో పీఎఫ్సీ ఆర్ఈసీ. రాష్ట్రానికి లోన్లు ఇస్తయ్. రాష్ట్రానికి మంచి డిసిప్లేయిన్ ఉంది కాబట్టి, లోన్లు రీపేమెంట్ మంచి ఉంటది కాబట్టి డబ్బులు ఇస్తరు. ఆ ఇచ్చే డబ్బులు ఆపేయమని …
Read More »ప్రధాని మోదీ చెప్పేది ఒక్కటి.. చేసేది ఒక్కటి.. ప్రెస్మీట్లో CM KCR ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. మోదీ చెప్పేది ఒకటి.. చేసేది ఒక్కటని ఆయన ఎద్దేవా చేశారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని.. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెచ్చిన్రు అని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిన్న, మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేం. …
Read More »Apకి ప్రత్యేక హోదాపై కీలక అడుగు
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఈనెల 17న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎస్‌కు సమాచారం అందింది. హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
Read More »యూపీ ఎన్నికలు- మంత్రిపై కేసు నమోదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ అభ్యర్థి, మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. కోవిడ్19 ప్రోటోకాల్ ప్రకారం బైరియా అసెంబ్లీ నియోజకవర్గంలో 144 సెక్షన్ కింద నిషేధిత ఆదేశాలు ఉన్నా.. మంత్రి స్వరూప్ వాటిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్తి జై ప్రకాశ్ ఆంచల్‌పైన కూడా ఇదే తరహా కేసు బుక్కైంది. బీజేపీ, ఎస్పీ అభ్యర్థులు ఇద్దరూ ప్రచారం కోసం …
Read More »మోదీపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు.. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు.. తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మడమే మోదీ పని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.హనుమకొండలో టీ డయాగ్నోస్టిక్, రేడియాలజీ ల్యాబ్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారుల బలిదానాలను కించపరిచారు అని …
Read More »తెలంగాణ త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రం
తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ (Gaddar) అన్నారు. తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మలను గద్దర్ దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో …
Read More »మోదీ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని …
Read More »