తమిళనాడు మంత్రి పీకే శేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన వారు, తమిళనాడులో ఉంటూ ధనవంతులుగా మారారని, దానికి కారణం తమపార్టీనే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. వారు EVMల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు. ఈ వ్యాఖ్యలు CM స్టాలిన్కు తలనొప్పులు తెచ్చిపెట్టేవేనని నిపుణులు అంటున్నారు.
Read More »మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »ఈటలతో భేటీపై కిషన్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాను భేటీ అయ్యానన్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘ఇప్పటివరకు ఈటల నన్ను కలవలేదు. నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే. ఈటల, నేను 15 ఏళ్లు కలిసి పనిచేశాం. కలిస్తే తప్పేంటి? కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేం. ఎప్పుడు కలుస్తున్నామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Read More »అసలు టూల్‌కిట్ రభస ఏమిటి?
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో, విద్వేష జాఢ్యంతో ప్రతిపక్షాలపై నిత్యం విషం గక్కే బిజెపి, కాషాయ పరివారం ఈ సారి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. – దేశాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకున్న టూల్‌కిట్ చూడండి అంటూ ఎఐసిసి అధికారిక లెటర్ హెడ్ కాపీగా ఒక పత్రాన్ని జతచేసి ‘కాంగ్రెస్‌టూల్‌కిట్ ఎక్స్‌పోజ్డ్’ హ్యాష్‌ట్యాగ్‌తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా …
Read More »ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.
Read More »కంటతడిపెట్టిన ప్రధాని మోదీ
కరోనాతో పాటు ప్రధాన సవాల్ గా ముందుకొచ్చిన బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని మోదీ కోరారు. మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని చెప్పారు. కొవిడ్ పరిస్థితులపై నేడు ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొవిడ్తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read More »కరోనా దెబ్బకు పడిపోయిన ప్రధాని రేటింగ్..!
ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రేటింగ్ క్రమంగా పడిపోతూ వస్తున్నది. దేశం యావత్తూ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్న తరుణంలో గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ రేటింగ్ అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ విషయాన్ని ఆమెరికాకు చెందిన ఒక సర్వే సంస్థ తన నివేదిక స్పష్టం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత …
Read More »దేశంలో లాక్డౌన్ పెట్టండి
కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించగా.. కొన్నిచోట్ల కరోనా బాధితులకు సరైన చికిత్స అందడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. ‘దేశంలో లాక్డౌన్ పెట్టాలి. కరోనా నియంత్రణలో అలసత్వం ఎందుకు? కరోనా చైన్ నియంత్రించాలంటే లాక్డౌన్ తప్పనిసరి. లాక్ డౌన్ పెట్టడం వల్ల మౌలిక వైద్య సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు’ అని IMA లేఖలో పేర్కొంది.
Read More »ఈ నెల 7న పుర మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక
తెలంగాణలో ఇటీవల జరిగిన పుర పోరుకు సంబంధించి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరగనుంది. ఈ షెడ్యూల్ను ఈసీ ఇవాళ ప్రకటించే అవకాశముంది. 5 మున్సిపల్, 2 కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తెలిసిందే. వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్, ఖమ్మం మేయర్ జనరల్ మహిళ, సిద్దిపేట బీసీ మహిళ, అచ్చంపేట జనరల్, నకిరేకల్ బీసీ జనరల్, జడ్చర్ల బీసీ మహిళ, కొత్తూరు జనరల్ …
Read More »సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన సీఎం జగన్
ప్రస్తుతం రాజకీయ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరహాలో ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జగన్ ముందు నుంచే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలోనే మంత్రి వర్గంలో …
Read More »