Home / Tag Archives: bjp (page 170)

Tag Archives: bjp

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే షాకిచ్చిన హ్యాకర్లు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్‌ చేశారు. కేంద్ర మంత్రి కాకముందు ఈ వెబ్‌సైట్‌ను తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ వెబ్‌సైట్‌ను అంతగా వినియోగించడం లేదు. ఆగస్టు 15న ఈ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అవగా.. ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినట్టుగా కిషన్‌రెడ్డి కార్యాలయం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు …

Read More »

మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్‌లో చేరారు. అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో …

Read More »

ప్రధాని మోదీకి బాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. వైకాపా ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని… ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని …

Read More »

ప్రతి ఒక్కరికి కరోనా టీకా

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో శనివారం ప్రధాని మోదీ దేశీయంగా తయారయ్యే టీకాల గురించి ప్రస్తావించారు. వాటి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రతి ఒక్కరు కరోనా వైరస్‌ టీకా కోసం ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు కంపెనీలు తమ టీకాలకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయని మీకు తెలియజేయాలను కుంటున్నాను. మన నిపుణులు, శాస్త్రవేత్తలు వాటికి …

Read More »

ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు

74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా …

Read More »

సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదు

 ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు

Read More »

మరో కేంద్ర మంత్రికి కరోనా

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంత్రులు, రాజకీయ నేతలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకగా, తాజాగా ఆయూష్ కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించిన ఆయన. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Read More »

రామమందిరం నమూనా చిత్రాలు మీకోసం

మరి కొద్ది గంటల్లో జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ప్రధాని నరేంద్ర మోదీ మఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. మూడు అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో …

Read More »

రామచక్కని ఆలయం

ఊరూరా కొలువై ఉన్న కోదండ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య నగరంలో దివ్య మందిరాన్ని నిర్మించేందుకు బుధవారం అంకురార్పణ జరగబోతోంది. వేద పఠనం, మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దాదాపు 40 కిలోల వెండి ఇటుకతో ఆలయానికి శంకుస్థాపన చేస్తారు. అంతకుముందు ఆంజనేయ ఆలయంలో పూజలు చేస్తారు. భూమి పూజ కార్యక్రమంలో గంగా, …

Read More »

జిమ్‌లు , యోగా సెంటర్లకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన విధి విధానాలు జిమ్‌లు, యోగా కేంద్రాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat