Home / BHAKTHI / రామచక్కని ఆలయం

రామచక్కని ఆలయం

ఊరూరా కొలువై ఉన్న కోదండ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య నగరంలో దివ్య మందిరాన్ని నిర్మించేందుకు బుధవారం అంకురార్పణ జరగబోతోంది. వేద పఠనం, మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దాదాపు 40 కిలోల వెండి ఇటుకతో ఆలయానికి శంకుస్థాపన చేస్తారు.

అంతకుముందు ఆంజనేయ ఆలయంలో పూజలు చేస్తారు. భూమి పూజ కార్యక్రమంలో గంగా, యమున, సరస్వతి- త్రివేణి సంగమం నుంచే కాకుండా దేశంలోని 11 పవిత్ర ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టి, జలాలను వినియోగిస్తున్నారు.

సరిగ్గా 32 సెకన్లపాటు ఈ ముహూర్త కార్యక్రమం ఉంటుంది. ఇందుకోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొవిడ్‌ ముప్పు నేపథ్యంలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ సహా మొత్తం 175 మంది ప్రముఖులనే భూమి పూజ కార్యక్రమానికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానించింది.

అయితే- యావత్‌ భారతావని వీక్షించేందుకు వీలుగా ఈ మహా క్రతువును దూరదర్శన్‌లో ప్రసారం చేయనున్నారు. భాజపా అగ్రనేతలు ఎల్‌.కె.ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి తదితరులు ఈ మహాక్రతువుకు స్వయంగా హాజరు కాలేకపోతున్నా.. వీడియో ద్వారా వీక్షించనున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat