జార్ల్హండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్ర్తెస్,జేఎంఎం మిత్రపక్షం విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటింది కాంగ్రెస్,జేఎంఎం కూటమి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏర్పాటుకు నలబై రెండు మంది సభ్యుల మద్ధతు అవసరం. ఇప్పటి వరకు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి నలబై మూడు స్థానాల్లో అధిక్యంలో ఉంది. …
Read More »రౌండప్-2019:మార్చి లో జాతీయ విశేషాలు
ఈ ఏడాదిలో ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తొమ్మిది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో జాతీయంగా చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము. మార్చి5న ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ప్రారంభం మార్చి7న దేశ కరెన్సీ వ్యవస్థలోకి రూ.20 నాణేం రాబోతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటన మార్చి 8న అయోధ్య వివాదం పరిష్కారానికి …
Read More »ఉన్నావ్ కేసులో శిక్ష ఖరారు
ఉన్నావ్ రేప్ కేసులో దోషి అయిన బీజేపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని తీజ్ హజారీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. దోషికి క్యాపిటల్ పనిష్మెంట్ (ఉరిశిక్ష)ను విధించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే కోర్టు మాత్రం కుల్దీప్ కు మాత్రం జీవిత ఖైదుని విధిస్తూ తీర్పునిచ్చింది. సరిగ్గా రెండేళ్ల …
Read More »ప్రధాని మోదీ హత్యకు కుట్ర..!
ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన మాదిరిగానే హత్య చేయడానికి కుట్ర జరిగిందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త సారాంశం మీకోసం” ఎల్గార్ పరిషత్ కేసులో 9 మంది హక్కుల నేతలు సహా 19 మందిపై ప్రాసిక్యూషన్ అభియోగాలను కోర్టుకు సమర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, దానితో మావోయిస్టు …
Read More »బీజేపీ నేతలు పెళ్లి చేసుకోరు కానీ అత్యాచారాలు చేస్తారంటా..?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” కాషాయపు వస్త్రాలు ధరించే కొందరు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు,కార్యకర్తలు పెళ్లిళ్లు చేసుకోరు. కానీ మహిళలపై అత్యాచారాలు చేస్తారంటూ “ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైంది. అత్యాచార నిందితులకు బీజేపీ రక్షణ కల్పిస్తుంది అని ఆయన ఆరోపించారు. అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో …
Read More »జనసేనానిపై మండిపడిన బీజేపీ, వీహెచ్‌పీ నేతలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వరుసగా మతపరమైన వ్యాఖ్యలతో హిందువులు, క్రిస్టియన్ల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నాడు. సీఎం జగన్‌పై క్రిస్టియానిటీ ముద్ర వేసి హిందువులను దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారు. అలాగే హిందూ మతం, హిందూ నేతలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తుంది..హిందువులేనని, హిందూ నేతల ప్రమేయం లేదని అది జరగదంటూ తలతోకా లేని ఆరోపణలు చేశాడు. మతాల మధ్య గొడవలు పెడుతూ …
Read More »జీఎస్టీ పరిహారం విడుదల
దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని ఈ రోజు సోమవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేసినట్లు సీబీఐసీ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Read More »కేంద్ర మాజీమంత్రి దంపతులు కన్నుమూత..!
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వర్ దయాళ్ స్వామి కొన్ని రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్‌లోని ఆసుపత్రిలో ఆదివారం మరణించారు. 1929 ఆగస్టు 11న అంబాలా జిల్లాలోని బాబియల్‌లో జన్మించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999లో కేంద్రమంత్రిగా పనిచేశారు. స్వామి మరణంపై పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడుగా ఎంపికయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు …
Read More »పవన్ కల్యాణ్‌కు వరుస షాక్‌లు.. రాజీనామాబాటలో సీబీఐ మాజీ జేడీ..?
జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరుతో పవన్ కల్యాణ్ తీరుతో విసిగిపోతున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజ రాజీనామా చేయగా…మరో కీలక నేత, సీబీఐ మాజీజేడీ వివి లక్ష్మీ నారాయణ కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు తన ఉద్యోగ బాధ్యతలకు రాజీనామా చేసిన లక్ష్మీ నారాయణ తొలుత సొంత పార్టీ …
Read More »మోదీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శనివారం జరిగిన భారత్ బచావో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” ప్రధానమంత్రి నరేందర్ మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ అని ఆయన పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు నిర్ణయం వికటించి ఆర్థిక పరిస్థితి మందగించింది. …
Read More »