Home / ANDHRAPRADESH / జనసేనానిపై మండిపడిన బీజేపీ, వీహెచ్‌‌పీ నేతలు..!

జనసేనానిపై మండిపడిన బీజేపీ, వీహెచ్‌‌పీ నేతలు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వరుసగా మతపరమైన వ్యాఖ్యలతో హిందువులు, క్రిస్టియన్ల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నాడు. సీఎం జగన్‌‌పై క్రిస్టియానిటీ ముద్ర వేసి హిందువులను దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారు. అలాగే హిందూ మతం, హిందూ నేతలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తుంది..హిందువులేనని, హిందూ నేతల ప్రమేయం లేదని అది జరగదంటూ తలతోకా లేని ఆరోపణలు చేశాడు. మతాల మధ్య గొడవలు పెడుతూ మత రాజకీయాలు ఆడేది హిందూ నాయకులేనని ఆరోపించాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను..సెక్యులరిజానికి ప్రమాదం హిందూ నేతలే అంటూ నోరుపారేసుకున్నాడు. పవన్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. హిందూ మతంపై, హిందూ నేతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మూడో పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా ఇతర మతాలకు మారిపోయాడా..వెంటనే హిందూవులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది..ఖబడ్దార్ పవన్ అంటూ హెచ్చరించారు. తాజాగా హిందూ మతంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఫైర్ అయ్యారు. తాజాగా హిందూ మతంపై, హిందూ నేతలపై పవన్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ ఖండించారు. అపరిపక్వ రాజకీయాలతో . హిందువుల మనోభావాలను పవన్‌ ఘోరంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలను బీజేపీ పూర్తిగా ఖండిస్తోందని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హిందూ నేతలపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్దమా అని ఈ సందర్భంగా కోట సాయికృష్ణ పవన్‌కు సవాలు విసిరారు. మరోవైపు వీహెచ్‌పీ నేతలు కూడా పవన్‌ వ్యాఖ్యలను ఖండించారు. పవన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌ డిమాండ్‌ చేశారు. పవన్‌కు పిచ్చిపట్టినట్లుందని వ్యాఖ్యానించారు. హిందువులను అగౌరవపరిచేలా మాట్లాడటం సరికాదని సూచించారు. మొత్తంగా హిందూ మతంపై, హిందూ నేతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.