Home / Tag Archives: carona cases (page 20)

Tag Archives: carona cases

దేశ వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే

ఏపీ ,తెలంగాణ  రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వే తరహా సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సేవలను వాడుకోవాలన్నారు. సెకండ్ వేవ్ గ్రామాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, దీన్ని కట్టడి చేసేలా వ్యూహాలు అమలు చేయాలన్నారు.

Read More »

భారత్ లో 3,11,170 కరోనా కేసులు

భారత్ లో గడిచిన గత 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077గా ఉంది. ఇక నిన్న 4077 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,70,284గా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

చద్దన్నం తింటే ఉంటది

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చద్దన్నం మంచి మెడిసిన్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులోని బ్యాక్టీరియా శరీరంలోని హానికర వైరస్లను నాశనం చేస్తుంది. చద్దన్నంలో చాలా రకాల పోషకాలుఉంటాయి. 1. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. 2. చర్మవ్యాధుల నుంచి కాపాడుతుంది. 3. మలబద్ధకం, పేగుల్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. 4. B12, B6 విటమిన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. 5. బీపీ కంట్రోల్లో ఉంటుంది.

Read More »

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 4,298 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 32మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 6,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 89.33 శాతంగా ఉంది. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 64,362టెస్టులు చేశారు.

Read More »

దేశంలో కరోనా విషయంలో కాస్త ఊరట

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 3.4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అవి 3.26 ల‌క్ష‌ల‌కు త‌గ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,26,098 కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 2,66,207 …

Read More »

ఏపీకి మరో 4.8లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 4.8 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వచ్చాయి. పుణె సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వ్యాక్సిన్ డోసులు చేరుకోన్నాయి… తొలుత వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు పంపనున్నారు. టీకాల కొరతతో ఇబ్బంది పడుతున్న వేళ.. తాజాగా వచ్చిన టీకాలతో కాస్త ఉపశమనం లభించనుంది.

Read More »

దేశంలో త్వరలో సింగిల్ డోసు టీకా

దేశంలో త్వరలో సింగిల్ డోసు టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ అనే సింగిల్ డోసు టీకా కోసం డాక్టర్ రెడ్డీస్, కేంద్రంతో చర్చలు జరుపుతోంది. అన్ని అనుమతులు లభిస్తే జులై నాటికి స్పుత్నిక్ లైట్ టీకా దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి రష్యాలో ఇప్పటికే అత్యవసర అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ 79.4% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు రష్యా తెలిపింది.

Read More »

తెలంగాణలో కరోనా కేసుల్లేని ఏకైక గ్రామం అదే..?

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వారానికి 2 సార్లు ఊరంతా శానిటైజేషన్, శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు, ఊర్లోకి ఎవరు వచ్చినా సాయంత్రానికే వెళ్లిపోవడం వంటి పంచాయతీ తీర్మానాలతో ఆ ఊరు భద్రంగా ఉంది. సెకండ్ వేవ్లో ఒక వ్యక్తికి స్పల్ప లక్షణాలు కనబడినా టెస్ట్ …

Read More »

భైంసాలో బ్లాక్ ఫంగస్ కలవరం

తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ కి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్క హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ ఫంగస్పై స్పందించిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు.. స్టెరాయిడ్స్ తీసుకున్న అందరికీ ఈ సమస్య రాదన్నారు.

Read More »

చాహల్ కుటుంబంలో కరోనా కలవరం

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల్లిదండ్రులు కొవిడ్ బారినపడ్డారు. చాహల్ తండ్రికి తీవ్రమైన కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.. తల్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. ‘దయచేసి ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ధనశ్రీ ఇన్స్టాలో రాసుకొచ్చింది.

Read More »