కరోనా రోగుల కాంటాక్టులకు వారం రోజులే క్వారంటైన్ ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు సైతం 7 రోజుల్లోనే డిశ్చార్జ్ కావొచ్చని పేర్కొంది. కాగా దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నట్లు వెల్లడించింది. బెంగాల్(32%), ఢిల్లీ(23%), మహారాష్ట్ర (22%)లో పాజిటివిటీ రేటు అధికంగా ఉందని వివరించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 2,319కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 90,021 టెస్టులు చేయగా కొత్తగా 2,319 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే 399 కేసులు పెరిగాయి. మంగళవారం 1,920 కేసులు నమోదయ్యాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 474 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గత 24 గంటల్లో GHMC పరిధిలో 1,275 …
Read More »ఒమిక్రాన్ కు వ్యాక్సిన్
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంటు కి మార్చి నాటికి టీకాను తీసుకురానున్నట్లు ఫైజర్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయని వెల్లడించింది. ఇప్పుడు మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు ఫైజర్ నుంచి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోసు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్ను తీసుకోవడంతో పాటు ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.
Read More »కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కాని ఆపరేషన్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆదేశించింది. అత్యవసర సర్జరీలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Read More »ఏపీలో భారీగా కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో నిన్న కొత్తగా 1,831 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం 984 కేసులు వెలుగు చూశాయి. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 7,195యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
Read More »గ్రేటర్ లో కొత్తగా 1,015 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,015 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,56,344 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 1,920కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 83,153 టెస్టులు చేశారు. 1,920 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే 100కేసులు పెరిగాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 417 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,496 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశంలో ప్రస్తుతం కరోనా భీభత్సం సృష్టిస్తున్నది.పలు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కొత్తగా 21,259 కోవిడ్ కేసులు పశ్చిమబెంగాల్లో కొత్తగా 21,098 మందికి కోవిడ్ తమిళనాడులో కొత్తగా 15,379 కేసులు నమోదు కర్ణాటకలో కొత్తగా 14,473 మందికి కరోనా కేరళలో కొత్తగా 9,066 కొవిడ్ కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ …
Read More »బూస్టర్ డోసు తీసుకుంటే లాభమా..? నష్టామా..?
రెండు డోసుల టీకా తీసుకున్నవారు 6 నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కొవిడ్ నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. బూస్టర్ డోసు తీసుకున్న 90శాతం మందిలో కరోనా వైరస్ ఆల్ఫా, బీటీ, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లను నివారించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు భారత్ బయోటెక్ పేర్కొంది.
Read More »దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,59,632 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18వేల కేసులు ఎక్కువగా వచ్చాయి. పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 10.21%గా నమోదైంది. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల 90వేలు దాటింది. ఇక 24గంటల్లో కరోనా మహమ్మారితో మరో 327 మంది మరణించారు. 40,863 మంది కోలుకున్నారు.
Read More »