తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »తెలంగాణలో లాక్డౌన్ పై మంత్రి కేటీఆర్ క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్లో నిర్వహించిన #askktrలో భాగంగా ఓ నెటిజన్ లాక్ డౌన్ గురించి ప్రశ్నించాడు. దానికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కరోనా కేసుల సంఖ్య, వైద్యశాఖ అధికారుల సలహాను బట్టి లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా.. తెలంగాణలో 18,339 యాక్టివ్(నిన్నటి వరకూ) కేసులున్నాయి. రోజుకు దాదాపు 2000కేసులు వెలుగు …
Read More »ఏపీలో కొత్తగా 4,348మందికి కరోనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా చేరుకుంటోంది. గడిచిన 24 గంటల్లో 47,884 మందికి పరీక్షలు చేయగా 4,348మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 14,204యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తంగా 20,92,227కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మొత్తం 14,507 మంది కరోనా కారణంగా మరణించారు.
Read More »పిల్లల్లో కరోనా కేసులు నిర్ధారణ లక్షణాలివే…
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పిల్లల్లో కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉన్న కొందరు చిన్నారులను టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు.. ఇద్దరికి ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో 101-102 డిగ్రీల జ్వరం, 3 విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే టెస్టు చేయించాలని సూచిస్తున్నారు.
Read More »ఏపీలో కొత్తగా 3,205కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 3,205కరోనా కేసులు వెలుగు చూశాయి. 2 రోజుల్లోనే 2వేలకు పైగా కేసులు పెరిగాయి. నిన్న 1,831 కేసులు వచ్చాయి. కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 10,119 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖలో 695, చిత్తూరు 607, తూ.గో 274, శ్రీకాకుళం 268, గుంటూరు 224, కృష్ణా 217, విజయనగరం 212, నెల్లూరు జిల్లాలో 203, అనంతపురం జిల్లాలో 160 మంది వైరస్ బారినపడ్డారు. 281 మంది …
Read More »కరోనా క్వారంటైన్ నిబంధనల్లో మార్పు
కరోనా రోగుల కాంటాక్టులకు వారం రోజులే క్వారంటైన్ ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు సైతం 7 రోజుల్లోనే డిశ్చార్జ్ కావొచ్చని పేర్కొంది. కాగా దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నట్లు వెల్లడించింది. బెంగాల్(32%), ఢిల్లీ(23%), మహారాష్ట్ర (22%)లో పాజిటివిటీ రేటు అధికంగా ఉందని వివరించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 2,319కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 90,021 టెస్టులు చేయగా కొత్తగా 2,319 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే 399 కేసులు పెరిగాయి. మంగళవారం 1,920 కేసులు నమోదయ్యాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 474 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గత 24 గంటల్లో GHMC పరిధిలో 1,275 …
Read More »ఒమిక్రాన్ కు వ్యాక్సిన్
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంటు కి మార్చి నాటికి టీకాను తీసుకురానున్నట్లు ఫైజర్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయని వెల్లడించింది. ఇప్పుడు మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు ఫైజర్ నుంచి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోసు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్ను తీసుకోవడంతో పాటు ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.
Read More »కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కాని ఆపరేషన్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆదేశించింది. అత్యవసర సర్జరీలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Read More »ఏపీలో భారీగా కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో నిన్న కొత్తగా 1,831 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం 984 కేసులు వెలుగు చూశాయి. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 7,195యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
Read More »