Home / SLIDER / నిబంధనలు పాటించకపోతే రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయి

నిబంధనలు పాటించకపోతే రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు.

ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.

ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.