Home / Tag Archives: carona possitive (page 61)

Tag Archives: carona possitive

సీఎం కేసీఆర్ కి యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం  కేసీఆర్ గారికి  గురువారం నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. నిన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు శ్రీ ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం  …

Read More »

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి ఈట‌ల ఫైర్

కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ‌కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేత‌లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ప‌రిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ‌లో 4 రాష్ర్టాల‌కు చెందిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. మేం కేంద్రాన్ని విమ‌ర్శించ‌ట్లేదు.. వారే …

Read More »

కోలుకున్న ధోనీ తల్లిదండ్రులు…!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ధోనీ త‌ల్లిదండ్రులు దేవ‌కీ దేవి, పాన్‌సింగ్‌ ఈ నెల 20 నుంచి రాంచీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో వైద్యులు తాజాగా పరీక్షలు నిర్వహించారు.  కరోనా నెగటివ్‌ అని నిర్ధారణ కావడంతోపాటు, లక్షణాలేవీ …

Read More »

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతపై కీలక ప్రకటన

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు పాస్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎగ్జామ్ ఫీజు చెల్లించిన వారే పాస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని సూచించారు. అది తప్పుడు వార్త అని.. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More »

కరోనా ఎఫెక్ట్ – మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని.. తద్వారా ఆక్సిజన్ నిల్వల్ని వైద్య అవసరాల కోసం మళ్లించనున్నట్లు తెలిపింది. మే 1 నుంచి 9 వరకు హర్యానాలోని ఫ్యాక్టరీలను మూసి ఉంచనుండగా.. ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ హామీ ఇచ్చింది.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై క్లారిటీ

తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. వైద్యారోగ్య శాఖ లాక్డౌన్పై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 3, 4 వారాల్లో కరోనావైరస్ అదుపులోకి వస్తుందన్నారు. లాక్డౌన్ పెట్టాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ సీఎం KCRకు ఇష్టం లేదని హోంమంత్రి అన్నారు.

Read More »

కరోనా సోకిన వారు ఇవి తినాలి..?

మీకు కరోనా వచ్చిందా… లేదా కరోనా  లక్షణాలు ఉన్నాయా.. అయితే కింద పేర్కొన్న వాటిని తినడం మరిచిపోవద్దు.. 1. రోజుకు 60 నుంచి 100 గ్రాముల పప్పు తీసుకుంటే ప్రొటీన్లు అందుతాయి. 2. ఆపిల్, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లు తినాలి. 3. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, మాంసం,గుడ్లు తీసుకోవాలి. 4. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి. 5. మజ్జిగను 12 గంటలు పులియబెట్టి …

Read More »

కరోనా ఎఫెక్ట్ -భారత్ కు అమెరికా భారీ సాయం

ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …

Read More »

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 74,748 టెస్టులు చేయగా 14,669 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 10,69,544కు చేరింది. గత 24 గంటల్లో 71 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 7,871గా ఉంది. నిన్న 6,433 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 9,54,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,611గా ఉంది.

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 7,994 మందికి వైరస్ సోకింది. మరో 58 మంది మృతి చెందారు. అదే సమయంలో 4,009 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 1,630, మేడ్చల్ 615, రంగారెడ్డి 558 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat