తెలంగాణలో నిన్న 31,486 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. ఇందులో 4,005 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,581 కరోనా మరణాలుసంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 75,15,066 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.
Read More »లక్షద్వీప్‌లో మొదటి కరోనా కేసు
దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసు లేకుండా జాగ్రత్తలు పాటించిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ మేరకు PTI వెల్లడించింది కొచ్చి నుంచి కవరత్తికి ఓడలో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. లక్షద్వీప్‌లోని మొత్తం 36 ద్వీపాల్లో 64వేల మంది ప్రజలు ఉన్నారు.. ఈ కేసు ముందువరకూ కరోనా లేని ప్రాంతంగా రికార్డులో నిలిచింది. కరోనా నిబంధనలను కఠినంగా …
Read More »కరోనాతో ఎమ్మెల్యే మృతి
కేరళకు చెందిన సీపీఎం ఎమ్మెల్యేను కరోనా బలి తీసుకుంది. కొంగడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేవీ విజయదాస్ కరోనాతో మృతి చెందారు. డిసెంబర్ 11న కరోనాతో ఆస్పత్రిలో చేరిన విజయదాస్… ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. విజయదాస్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. 2016 ఎన్నికల్లో విజయదాస్ 13 వేల ఓట్ల మెజార్టీతో …
Read More »తెలంగాణలో కరోన తగ్గుముఖం
తెలంగాణలో నిన్న 21,893 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 2,91,872కి చేరింది. ఇందులో 4,049 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,244 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,579 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 74,83,580 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.
Read More »భారత్ లో కరోనా కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర ఎంతో తెలుసా..?
భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైంది. ఇందులో భాగంగా తొలి విడతగా ఆర్డరిచ్చిన 1.1 కోట్ల డోసుల కొవిషీల్డ్, 55 లక్షల డోసుల కొవార్టిస్ టీకాల్లో.. మంగళవారం నాటికి 54.72 లక్షల డోసులు రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలకు చేరాయి. కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర రూ.200 ఉండగా.. కోవార్టిన్ ధర రూ.295గా ఉంది. ఈ రేట్ల ఆధారంగా చూస్తే ఓ ఫుల్ ప్యాక్ బిర్యానీ ధరకే …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 15,968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,95,147కు పెరిగింది. కొత్తగా 17,817 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,01,29,111 కోలుకున్నారని తెలిపింది. మరో 202 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడగా.. మొత్తం మృతుల సంఖ్య …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. మంగళవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,571కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …
Read More »హైదరాబాద్‌కు చేరుకున్న కరోనా టీకా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా రాష్ర్టానికి రానే వచ్చింది. మంగళవారం ఉదయం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమానశ్రయానికి తరలించారు. 6.5 లక్షల డోసుల కొవిడ్ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో రాష్ర్టానికి చేరుకున్నాయి. మరికాసేపట్లో శంషాబాద్ నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులను తరలించనున్నారు. కోఠి ఆరోగ్య కార్యాలయంలో …
Read More »సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి బ్యాంకాక్ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. సోమవారం ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు. మరి కాసేపట్లో థాయ్ ఓపెన్ ప్రారంభం కానుండగా సైనాకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆమె… తాజా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. …
Read More »ఈనెల 16 నుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్
తెలంగాణలో ఈనెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ తర్వాత రియాక్షన్ ఉంటే వైద్య చికిత్స అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. వ్యాక్సిన్ వేయించే బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ముందుగా ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసు, భద్రతా బలగాలకు టీకా వేయనున్నారు. ఆ తర్వాత 50ఏండ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో …
Read More »