భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఆ స్టేట్లో సోమవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12 యాక్టివ్ కేసులే ఉన్నాయని స్పష్టం చేసింది, నాగాలాండ్లో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా గత శనివారం వరకు 21,481 మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు కేరళ, మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,712కు చేరింది. ఇందులో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,94,386 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనాతో ఒకరు చనిపోగా… మొత్తం 1,625 కరోనా మరణాలు సంభవించాయి
Read More »దేశంలో కొత్తగా 14,199 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,50,055 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,99,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 83 మంది చనిపోగా, మొత్తం 1,56,385 కరోనా మరణాలు సంభవించాయి.
Read More »మళ్లీ కరోనా గజగజ
హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే …
Read More »కరీంనగర్ జిల్లాలో ఒకే ఊరిలో 33మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా రావడం కలకలం రేపుతోంది, రూరల్ మండలం చేగుర్తిలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు… ఆయన అంత్యక్రియలు, కర్మకు చేగుర్తి, దుర్శేడ్, మొగ్గుంపూర్ వాసులు వచ్చారు. వీరిలో కొందరికి లక్షణాలు కనిపించడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా… 33నుందికి కరోనా వచ్చింది. దీంతో ఇవాళ కూడా గ్రామంలో కరోనా టెస్టులు చేయనున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,113కి చేరింది. ఇందులో 1,700 యాక్టివ్ కేసులు ఉండగా.. 658 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటివరకు 2,93,791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,622కి చేరింది.
Read More »దేశంలో ఇప్పటికి 85లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు 85 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వచ్చే సైడ్ ఎఫెక్టులు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఒక్కరు కూడా మరణించలేదన్న ఆయన.. దేశంలో కరోనా రికవరీ రేటు కూడా 97.29%గా ఉందని, ప్రపంచంలో అత్యంత తక్కువ కరోనా మరణాల రేటు కూడా దేశంలోనే నమోదైందన్నారు. గత 7రోజుల్లో 188 జిల్లాల్లో ఒక్క కరోనా …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా కరోనా బారీన పడి 81 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న 11,805 మంది నిన్న డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,25,710 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన …
Read More »కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ టాప్
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకెళ్తోంది ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ రోజుల్లో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. దేశంలో ఇప్పటివరకు 60 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేశారు ఇండియాలో ఈ టీకాల పంపిణీకి 24 రోజుల సమయం పట్టింది. అమెరికాలో 26 రోజులు, యూకేలో 46 రోజుల సమయం పట్టింది. దేశంలో సోమవారం ఒక్కరోజే 2,23,298 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
Read More »దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది. ఇందులో 1,05,34,505 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,55,080 మంది మరణించారు. మరో 1,48,609 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో వైరస్ వల్ల 84 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 11,904 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో రికవరీ రేటు …
Read More »