తెలంగాణలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,95,682కు చేరింది. ఇక నిన్న ఒకరు కరోనాతో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,611కు పెరిగింది. నిన్న 197 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,842 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనా పన్నుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సర్కారు ‘కరోనా’ పన్ను విధిస్తుందనే వార్తలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. కరోనాకు సంబంధించి పన్ను/సెస్ విధించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇటీవల బడ్జెట్ దేశంలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందన్నారు. గత 3 నెలల్లో GST ఆదాయం పెరిగిందన్నారు దేశాభివృద్ధి కోసం SBI వంటి పరిమాణంలో మరో 20 సంస్థల అవసరం ఉందన్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 150 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. ఇందులో 2,92,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో 1610 మంది మరణించగా, 1939 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, నిన్నరాత్రి 8 గంటల వరకు 186 మంది కరోనా బారినుంచి బయటపడ్డారని, మరో ఇద్దరు బాధితులు మరణించారని తెలిపింది. మొత్తం యాక్టివ్ …
Read More »కరోనా వ్యాక్సిన్ పై టర్కీ సంచలన నిర్ణయం
టర్కీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది కరోనా వ్యాక్సిన్ డోసులకు.. తమ దేశంలో తలదాచుకుంటున్న ఉన్న వీగర్ ముస్లింలను డ్రాగన్ కు అప్పగించేందుకు సిద్ధమైంది. చైనా చెర నుంచి తప్పించుకున్న చాలామంది వీగర్ ముస్లింలు టర్కీలో తలదాచుకుంటున్నారు. శాంతి భద్రతల పేరు చెప్పి చైనా వీరందరినీ బందీలుగా చేస్తోంది. చైనా 10 లక్షల డోసుల టీకాలను ఇంకా టర్కీకి చేరవేయలేదు. ఈ నేపథ్యంలో వీగర్లు ఆందోళన చెందుతున్నారు
Read More »తెలంగాణలో ఈ నెల 13 నుంచి రెండో విడత కరోనా వ్యాక్సిన్
తెలంగాణలో ఈ నెల 13 నుంచి వైద్య సిబ్బందికి రెండో విడత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గత నెల 16 నుంచి తొలి విడత డోస్ పొందిన వారికి వరుస క్రమంలో 28వ రోజున రెండో డోసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకొని, ఇప్పటివరకూ టీకా తీసుకోకుంటే శనివారం వేయించుకోవాలని.. తొలి డోసు తీసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని అధికారులు …
Read More »భారత్ లో 30కోట్ల మందికి కరోనా
మొత్తం 135కోట్ల జనాభా ఉన్న ఇండియాలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాపించి ఉండొచ్చని ICMR సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గిన విషయం కూడా తెలియకపోవచ్చని సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి చెప్పారు. తగినంత రోగనిరోధక శక్తి ఉండటం వల్లే లక్షణాలు బయటపడట్లేదన్నారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 30 వేల మందిపై సర్వే నిర్వహిస్తే.. 15 మందికి ఒకరిలో కోవిడ్ …
Read More »ఏపీలో నేటి నుండి మలివిడత కరోనా టీకా పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మలివిడత కార్యక్రమం ఇవాళ మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోని ఉద్యోగులకు టీకాలు ఇవ్వనున్నారు.. కోవిన్ యాప్ లో 5.90 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు తొలి విడతలో 3.88 లక్షల మంది ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటివరకు 48.90శాతం మందికి టీకాలు పంపిణీ చేయగా.. 74 మందికి మాత్రమే దుష్ఫలితాలు వచ్చాయి
Read More »దేశంలో 13,052 కరోనా పాజిటివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 13,052 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా వైరస్ నుంచి కోలుకొని 13,965 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపింది. అలాగే మరో 127 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో 1,07,46,183కు చేరాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 1,04,23,125 మంది కోలుకున్నారని పేర్కొంది. వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య …
Read More »కరోనా వ్యాక్సిన్ పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. శుక్రవారం వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా భావిస్తున్నానని, ఫ్రంట్ లైన్ వర్కర్లంతా ముందుకు వచ్చి సురక్షితమైన వ్యాక్సిన్ తీసుకోవాలని ఉపాసన సూచించారు. మహమ్మారిపై ఒక జాతిగా మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 186కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి గం.8 వరకు కొత్తగా 186 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,306కు చేరింది. ఇక నిన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,598కు పెరిగింది. ఇప్పటివరకు 2,90,354 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 2,354 యాక్టివ్ కేసులున్నాయి
Read More »