Home / Tag Archives: carona test

Tag Archives: carona test

కరోనా వ్యాధి లో సిటి స్కాన్ (CT Scan) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి..

*కరోనా వ్యాధి లో CT స్కాన్ (సిటీ స్కాన్) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి* 👇 ఇవాళ చాలామందికి కరోనా ఉన్నదా ? లేదా ? అని తెలుసుకోవడానికి మరియు కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది , ఎంత తీవ్రత వుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి *CORADS* రెండు *CT severity …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,813 కరోనా కేసులు

 తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,29,896 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

Read More »

ఏపీలో 2 కోట్లు దాటిన కరోనా టెస్ట్‌లు

ఏపీలో 2 కోట్లు దాటిన కరోనా టెస్ట్‌లు జీరో నుంచి 16 నెలల్లో 2,00,39,764 టెస్ట్‌లు చేసిన రాష్ట్రం కరోనా టెస్ట్‌లో ఏపీ బెస్ట్..దేశ సగటు కంటే మెరుగ్గా పరీక్షలు ప్రతి 10 లక్షల జనాభాకు ఆంధ్రప్రదేశ్‌లో 3.75లక్షల పరీక్షలు చేయగా.. దేశ వ్యాప్తంగా 2.67 లక్షల టెస్ట్‌లు మాత్రమే జరిగాయి 2020 మార్చికి ముందు నమూనాలు.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేనిస్థాయి నుంచి.. …

Read More »

COVID లక్షణాలు -నిర్ధారణ – విశ్లేషణ

■ COVID లక్షణాలు | నిర్ధారణ | విశ్లేషణ | ■ జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. > లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. > 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా …

Read More »

దేశంలో లాక్డౌన్ పెట్టండి

కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించగా.. కొన్నిచోట్ల కరోనా బాధితులకు సరైన చికిత్స అందడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. ‘దేశంలో లాక్డౌన్ పెట్టాలి. కరోనా నియంత్రణలో అలసత్వం ఎందుకు? కరోనా చైన్ నియంత్రించాలంటే లాక్డౌన్ తప్పనిసరి. లాక్ డౌన్ పెట్టడం వల్ల మౌలిక వైద్య సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు’ అని IMA లేఖలో పేర్కొంది.

Read More »

కరోనా ఎఫెక్ట్ – రిషబ్ పంత్ సంచలన నిర్ణయం

దేశంలో కరోనా పరిస్థితులను చూసి రిషబ్ పంత్ చలించిపోయాడు. ‘నేను హేమ్కంత్ ఫౌండేషన్కు విరాళం అందజేస్తున్నా. అది ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, కరోనా రిలీఫ్ కిట్లు అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలకు సాయం అందించే సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నా. మీరూ తగినంత విరాళం ఇవ్వండి’ అని పంత్ ట్వీట్ చేశాడు. అటు CSK టీం కూడా 450 ఆక్సిజన్ కాన్సర్ట్రేటర్లను భూమిక ట్రస్టుకు అందించింది.

Read More »

కరోనా ఎఫెక్ట్ – మహేష్ బాబు పిలుపు

కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హీరో మహేశ్ బాబు సూచించారు. ‘కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించండి. అవసరమైతేనే బయటకు రండి. కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో చూసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీంతో అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని మహేశ్ ట్వీట్ చేశారు.

Read More »

కరోనా ఎఫెక్ట్ – మందుబాబులకు వార్నింగ్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవాళ్లపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు తక్కువగా, మరణాల రేటు ఎక్కువగా ఉంటోందన్నారు. మద్యపానం సేవించేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే దీనికి కారణమన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, CII ఆధ్వర్యంలో జరిగిన వెబినార్లో ఈ విషయం …

Read More »

మంచు లక్ష్మీపై మరోసారి ట్రోలింగ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మంచు లక్ష్మీపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుతుంది. కరోనా మొదటి డోస్ తీసుకున్నానని చెప్పడంతో మంచు లక్ష్మీపై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. యశోద హాస్పిటల్లో ఫస్ట్ డోస్ వేసుకున్నానని, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయడం ఆపేశారని, కానీ మంచు లక్ష్మీకి ఎలా వేశారు. రెండో డోస్ వేసుకునే వాళ్లకే వ్యాక్సిన్ ఇస్తున్నామని ప్రభుత్వం …

Read More »

తెలంగాణలోని పల్లెల్లో కరోనా విజృంభణ

తెలంగాణలోని పల్లెల్లో సరైన చికిత్స అందకపోవడం, కిట్ల కొరతతో టెస్టులు జరగకపోవడంతో కరోనా తీవ్రతరం అవుతోంది. ప్రాణాలూ కోల్పోతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్లో నెలరోజుల్లో 20 మంది మరణించగా, 200 మందికి పైగా కరోనా సోకింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో 20 రోజుల్లో 10 మంది కరోనాకు బలయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ఇటీవల 150 మందికి కరోనా సోకగా, ఏడుగురు మరణించారు.

Read More »