దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు..
4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్‌గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు.
ఇక 24 గంటల వ్యవధిలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,547కి చేరింది.