Home / Tag Archives: carona vaccine

Tag Archives: carona vaccine

కరోనాతో ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) మృతి

టాలీవుడ్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) గతరాత్రి కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగాం. స్వరమాధురి సంస్థ స్థాపించి 6,500కు పైగా కచేరీలు చేశారు. ‘ఒక వేణువు వినిపించెను’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి పాటలను పాడారు. ‘పండంటి కాపురం’, ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లోనూ తన గాత్రంతో అలరించారు.

Read More »

తెలంగాణ సర్కారు మరో సంచలన నిర్ణయం – ఏకంగా ఇంటికే..?

తెలంగాణలో కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దని సీఎం కేసీఆర్ కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందజేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.రాష్ట్రంలో లాక్ డౌన్ ఎందుకు విధంచగూడదనే విషయం గురించి సీఎం లోతైన …

Read More »

కరోనా చికిత్సలో తొలి 5 రోజులు గోల్డెన్‌ టైం..

మీకు స్వల్ప జ్వరం ఉందా? కాస్త తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు కూడా ఉన్నాయా? వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఏమీ కాదులే అని లాపర్వా చేస్తున్నారా? తీరికలేని పని కారణంగా వచ్చాయని, ఎండలతో వచ్చాయని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తేలిగ్గా తీసుకుంటున్నారా? మీకు మీరుగా తీసుకునే ఈ నిర్ణయాలే అటు తరిగి ఇటు తిరిగి చివరికి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అవును.. కరోనా చికత్సలో తొలి ఐదు …

Read More »

దేశంలో 4,12,262 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 4,12,262 కేసులు, 3,980 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,10,77,410కి చేరింది. మరణాల సంఖ్య 2,30,168కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,72,80,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

KYC అప్డేట్ పై ఆర్బీఐ కీలక ప్రకటన

అన్ని ప్రభుత్వ ప్రయివేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వినియోగదారులు KYC అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో RBI సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను RBI తాజాగా కోరింది. దీంతో డిసెంబర్ 31 వరకు KYC అప్ డేట్ చేసుకోకపోయినా.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Read More »

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా

ఏపీలో సంచలనం సృష్టించిన సంగం డెయిరీలో అక్రమాలకు సంబంధించి అరెస్టైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ తేలింది. ఇటీవల జ్వరం, జలుబు లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని హైకోర్టు ఏసీబీ అధికారులను ఆదేశించింది. దీంతో నరేంద్రను రాజమహేంద్రవరం జైలు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించనున్నారు.

Read More »

GHMCలో కరోనా కట్టడీపై ఇంటింటి సర్వే

తెలంగాణలో కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి స‌ర్వే బుధ‌వారం కూడా కొన‌సాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితాను సిబ్బంది న‌మోదు చేస్తుంది. జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్మికులతో కూడిన మొత్తం 707 బృందాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 41,305 ఇండ్ల‌ను సర్వే చేశాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఈ బృందాలు 19,090 మందిని బస్తీ …

Read More »

తెలంగాణలో 6,026 కరోనా కేసులు

తెలంగాణలో మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 6,026 పాజిటివ్‌ కేసులు రికార్డవగా.. 52 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. కొత్తగా 79,824 మందికి టెస్టులు చేయగా.. 6,026 కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. తాజాగా వైరస్‌ నుంచి 6,551 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 క్రియాశీల కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,115, …

Read More »

తెలంగాణలో నియంత్రణలోనే కరోనా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలు, మార్గ నిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, డిఎం & హెచ్.ఓ.ల తో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మీడియా తో మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు …

Read More »

కరోనా కట్టడీకి అదోక్కటే మార్గం

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటిన, 60 శాతం బెడ్లు నిండిన ప్రాంతాల్లో కఠిన లాక్డ్ డౌన్ విధించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు కరోనా చైన్ని తెంచలేవన్నారు. ప్రాంతీయ లాక్డౌనే ఏకైక మార్గమన్న ఆయన.. ఇదే అంశం కేంద్ర మార్గదర్శకాల్లో సైతం ఉన్నా అమలు పరచడం లేదన్నారు.

Read More »