తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ …
Read More »దేశంలో కరోనా మరణ మృదంగం
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
Read More »రాహుల్ గాంధీకి కరోనా
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ లక్షణాలు స్పల్పంగా కనిపించినట్టు రాహుల్ స్వయంగా ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలని, సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ఇటీవల రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. దేశంలో ఒక్కరోజే కొత్తగా.. 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి కొత్తగా 1,761 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1.80లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,31,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్లో అత్యధిక కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్నాయి.
Read More »గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.GHMCలో గడచిన 24 గంటల్లో మరో 793 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 91,563 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »టీకా వేశాక పాజిటివ్ రాదు!
వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు వస్తాయి. జలుబు చేసినట్లు కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ కచ్చితంగా వస్తాయి. వారు ఆస్పత్రులకు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాక 15 రోజుల వరకు ఎప్పుడు టెస్టు చేయించుకున్నా పాజిటివ్ అనే వస్తుంది. అలాంటి వారిని భయపడొద్దని చెప్పండి. టెస్టులు చేయించుకోవద్దని చెప్పండి. అనవసరంగా పాజిటివ్ అని భయపడొద్దు..’అంటూ వైద్య సిబ్బంది చెప్తున్నట్టుగా ఓ ఆడియో క్లిప్పింగ్ …
Read More »కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 2 లక్షల 73 వేల 810 మంది వైరస్ బారిన పడ్డారు. వరసగా 5వ రోజూ కేసులు 2 లక్షలు దాటాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇదే అత్యధికం. ఏకంగా 1,619 మంది మరణించారు. ఒక్క రోజులో సంభవించిన మరణాల్లో కూడా ఇవే అధికం. దేశంలో కరోనా మరింత ప్రమాదకరంగా …
Read More »GHMCలో 705 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం GHMCలో గడచిన 24 గంటల్లో మరో 705 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 90,770కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి కేసుల సంఖ్య 5వేలు దాటేసింది. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 1,29,637 టెస్టులు నిర్వహించగా.. 5,093 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 3,51,424కు పెరిగింది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. గత ఏడాది జూన్ 7, జూలై 31, ఆగస్టు …
Read More »