తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం GHMCలో గడచిన 24 గంటల్లో మరో 705 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 90,770కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.