మేడ్చల్ జిల్లాలో ఆరునెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ పేజ్-3లో ఓ క్యాబ్ డ్రైవర్ కుటుంబం నివాసముంటున్నది. ఆరునెలల తన కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సదరు క్యాబ్ డ్రైవర్ ఈ నెల 8న హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. వెంటనే పాపను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read More »కరోనా నియంత్రణలో తెలంగాణ భేష్
కరోనా మహమ్మారి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా. శాసనసభ లోని స్పీకర్ గారి ఛాంబర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం తరుఫున పాల్గొన్న శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, …
Read More »తెలంగాణ లో కొత్తగా 56 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే యాబై ఆరు కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసులు సంఖ్య 928కి చేరుకుంది .మంగళవారం ఎనిమిది మంది కోలుకుని డి శ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలి పింది. అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 24మంది మృతి చెందారు. అత్యధికం గా సూర్యాపేటలో 26కేసులు నమోదు అయ్యాయి.
Read More »ప్రపంచ వ్యాప్తంగా 25లక్షలు దాటిన కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతుంది.మంగళవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 25.03లక్షలకు చేరుకుంది.ఇందులో 1,71,810 మంది మృత్యు ఒడిలోకి చేరారు.అయితే ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి అనే సంగతి తెలుసుకుందాం. అమెరికాలో 7,92,958కేసులు నమోదు అయితే వీరిలో 42,531మృతి చెందారు. స్పెయిన్ లో 2,04,178కేసులు నమోదు అయితే 21,282మరణాలు చోటు చేసుకున్నాయి.ఇటలీలో 1,81,228కేసులు నమోదు …
Read More »కరోనా అక్కడ జన్మించలేదు
ప్రపంచానికి చెమటలు పట్టిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ తమ సృష్టి కాదని, అపనవసరంగా నిందలు వేయడం తగదని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారులు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఇదే అభిప్రాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వ్యక్తం చేసింది. వైరస్ …
Read More »అమెరికాలో చిక్కుక్కున్న సునీల్ ఆరోరా
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా అమెరికాలో చిక్కుకుపోయారు. వ్యక్తిగత సెలవుపై సునీల్ ఆరోరా మార్చి 7న అమెరికా వెళ్లారు. ఏప్రిల్ 4వ తేదీన ఇండియాకు ఆరోరా తిరుగు ప్రయాణం కావాల్సి ఉండే. కానీ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి 23న కేంద్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సునీల్ ఆరోరా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తనతో …
Read More »కంగనా రనౌత్ రూ.10 లక్షలు విరాళం
కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికుల కష్టాలను తీర్చేందుకు టాలీవుడ్‌లో సీసీసీని చిరంజీవి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి సెలబ్రిటీలందరూ విరాళం ప్రకటిస్తూ వారి ఉదారతను చాటుకుంటున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు అక్కడి ఫెడరేషన్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించి తన గొప్పమనసును చాటుకున్నారు. ఈ …
Read More »కరోనా కట్టడికి మార్గం ఇదే
కరోనా కట్టడికి వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రఖ్యాత వైరాలజిస్ట్ ఇయాన్ లిప్కిన్ అన్నారు. అప్పటివరకూ సామాజిక దూరం పాటిస్తూ మహమ్మారికి ముప్పును తప్పించుకోవాలని సూచించారు. ప్లాస్మా థెరఫీ ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది మరికొద్ది రోజుల్లో వెల్లడికానుందని అన్నారు. కోవిడ్-19 గబ్బిలాల నుంచి మానవుడికి వ్యాపించిందని, దీన్ని ఎవరూ లేబొరేటరీల్లో సృష్టించలేదని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కరోనా వైరస్ అత్యంత భయానకపమైనదేమీ కాదని లిప్కిన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Read More »కరోనా కట్టడికై ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి
జిల్లాలో కరోనాకు రెండు సాంకేతిక బృందాలను నియమించామని, వైదులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు బాగా కష్టపడుతున్నారని, నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఆసుపత్రి వైద్య సిబ్బందికి 100 పీపీఈ కిట్స్ మంత్రి చేతుల మీదుగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడికై ప్రజలు …
Read More »ఆసరా పింఛన్లకు రూ.2931కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలబై లక్షల మంది దాక ఆసరా పింఛన్లను అందుకుంటున్న సంగతి విదితమే.వికలాంగులకు రూ.3,016,ఇతరులకు రూ.2,016లను ఆసరా పింఛన్ కింద ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్రమంలో ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండటానికి మొదటి త్రైమాసికానికి రాష్ట్రప్రభుత్వం నిధులను విడుదల చేసింది.మూడు నెలలకు సంబంధించి రూ.2931.17కోట్లను నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు పెన్షన్లందరికీ డెబ్బై ఐదు శాతం జీతాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »