Home / Tag Archives: carona

Tag Archives: carona

‘డోలో 650’ అనే పేరు దానికి ఎలా వచ్చిందో తెలుసా..?

ప్రస్తుతం కరోనా వల్ల ‘డోలో 650’ అనే పేరు ప్రపంచమంతటా మారుమోగుతోంది. ‘డోలో 650’ అనేది బ్రాండ్ పేరు. మందు పారాసెటమాల్. 650 ఎంజీ అంటే డోసు. పీ 650, సుమో ఎల్, పారాసిస్, పాసిమోల్, క్రోసిన్ ఇలా. చాలా పారాసెటమాల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సుపరిచితమైంది మాత్రం ‘డోలో 650’. కరోనా మొదటి లక్షణం జ్వరం కావడంతో డాక్టర్లు పారాసెటమాల్ వాడాలని సూచిస్తున్నారు. కానీ ప్రజలకు గుర్తుకొచ్చేది మాత్రం …

Read More »

దేశంలో కొత్తగా 3,06,064 మందికి కరోనా

దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన  కరోనా ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 3,06,064 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 17.78శాతం నుంచి 20.75శాతానికి చేరుకుంది. 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,49,335 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన  గత 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించారు.ఇందులో  కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,920 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

GHMCలో భారీగా కరోనా కేసులు

గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,670 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,69,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Read More »

మంత్రి కొడాలి నానికి కరోనా

ఏపీ అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు టీడీపీ నేత వంగవీటి రాధాకు సైతం కరోనా సోకింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఆయన కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

Read More »

కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర

దేశంలో కరోనా భీభత్సానికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్ర కరోనాతో అల్లాడిపోతుంది.రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి.ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఆ రాష్ట్రంలో ఏకంగా 40,925 కొత్త కరోనా కేసులు నమోదవ్వడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దాదాపు 20మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ఒమిక్రాన్ కేసుల్లోనూ మహారాష్ట్ర నే …

Read More »

తమిళనాడులో కరోనా విలయతాండవం

నిన్న మొన్నటివరకు వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాజాగా కరోనా విలయతాండవంతో అయోమయంలో పడింది ఆ రాష్ట్ర ప్రజల జీవితం.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 8,981కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి వైరస్ వల్ల ఏకంగా 8మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 30,817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో …

Read More »

సత్యరాజ్ కి కరోనా

సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కరోనా బారిన పడ్డాడు. పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటున్నాడు. కాగా.. గత రాత్రి పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ‘బహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్ అందరికి సుపరిచితుడు.

Read More »

పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం

పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో 173 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న కూడా ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 125 మంది కొవిడ్ పాజిటివ్ గా తేలారు.

Read More »