సబ్బండవర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టి సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటికే గొల్ల, కురుమ, యాదవులకు సబ్సిడీపై జీవాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పాడి రైతులకు గేదెలను పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో యూనిట్‌లో ఒక గేదె ఉండనుంది. యూనిట్ ధర, సబ్సిడీ, ఏ రకం గేదెలు అందజేయాలనే విషయంపై రాష్ట్ర …
Read More »మేడారం జాతరకు రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం…
2018 మేడారం సమ్మక్క -సారక్క గిరిజన మహాజాతర పోస్టర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మేడారం జాతరకు రావాలని సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరాచందూలాల్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రభుత్వంచే నియమించిబడిన ధర్మకర్తల పాలక …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త. 18 వేల పోస్టుల భర్తీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా …
Read More »యూకే పార్లమెంటులో తెలంగాణ జాగృతి సెమినార్…
యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటులో తెలంగాణ జాగృతి యూకే శాఖ భారత దేశ యువత సాధికారత మరియు లీడర్ షిప్ అంశంపై సెమినార్ ను నిర్వహించింది. ఈ సదస్సుకు యూకె పార్లమెంట్ సభ్యులు, లండన్ డిప్యూటీ మేయర్, యూత్ చాంపియన్స్, వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. యూకేతో పాటు మనదేశం లో వివిధ రంగాల్లో యూత్ కోసం ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు గురించి చర్చించారు. అలాగే …
Read More »రైతుల ఆర్థిక సహాయంపై..కేంద్రానికి తెలంగాణ మంత్రుల వినతి…
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. వ్యవసాయానికి ఆర్థిక సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు పంపిణీకి సంబంధించి మే నెలలో రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలని కేంద్ర మంత్రిని మంత్రులు పొచారం …
Read More »వచ్చే ఏడాది నుంచి వెటర్నరీ కాలేజీ, గిరిజన యూనివర్శిటీలు ప్రారంభం…
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ములుగు జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్ లోని మామునూరులో వెటర్నరీ కాలేజీ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ రెండింటిలో 2018 విద్యా సంవత్సరం జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో నేడు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వరంగల్ లోని మామునూరు వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు …
Read More »జపాన్‌లో మంత్రి కేటీఆర్ బిజీ ..బిజీ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు జపాన్ లో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో ,సీఈఓ ,చైర్మన్లతో వరస భేటీలు జరుపుతున్నారు మంత్రి కేటీఆర్ ..జపాన్ కు చెందిన ఐసీ ఫుడ్ సంస్థతో ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందాలు చేసుకున్నారు . మరోవైపు టోక్యోలో జరిగిన పలు రకాల కంపెనీలకు చెందిన అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు .వేస్ట్ …
Read More »తెలంగాణలో 108, 102, ప్రాజెక్ట్ రెక్కల వాహన సేవలు ప్రారంభం ..
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కిట్ల వాహన సేవలతో పాటు ఇతర వాహన సేవలను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని ఈ సేవలను ప్రారంభించారు. 102, 108, ప్రాజెక్టు రెక్కలు కార్యక్రమం కింద వాహన సేవలను సీఎం లాంచనంగా ప్రారంభించారు. కాన్పుకు ముందు, తర్వాత గర్బిణీలను తరలించేందుకు 102 వాహనాలు.. పట్టణాల్లో అత్యవసర సేవల …
Read More »తూప్రాన్ లో సీఎం కేసీఆర్ వరాల జల్లు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మెదక్ జిల్లాలో తూప్రాన్ లో పర్యటిస్తున్నారు .పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు .మండల కేంద్రంలో యాబై పడకల ఆస్పత్రినిప్రారంభించారు.అనంతరం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతే కాకుండా తూప్రాన్ లో సీసీ రోడ్లు ,డ్రైనేజీ పనులకోసం ఐదు కోట్లను మంజూరు చేస్తామని తెలిపారు .ఇరవై …
Read More »జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ-మంత్రి తుమ్మల…
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం తెలంగాణ భవన్‌లో జర్నలిస్టులతో మంత్రి తుమ్మల చిట్ చాట్ చేశారు. పదవి ఉంటుంది పోతుందని… కానీ చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. విశాలమైన రోడ్లు అభివృద్ధికి సూచికలని, ఒక రోడ్డు వేస్తే అభివృద్ధి అదే వస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. టీఆర్ఎస్ …
Read More »