తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు ఉదయ్ తన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి గారితో కల్సి తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు గారు ,పువ్వాడ అజయ్ గారిని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రంలోని వరద సహాయ చర్యల కొరకు 2లక్షల రూపాయిలు విరాళంగా …
Read More »ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
16వ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ,విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్మా పోటి చేస్తున్న సంగతి విధితమే. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ …
Read More »మంత్రి జగదీష్ రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని సీఎం కేసీఆర్ ప్రత్యేక సందేశాన్ని మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు.
Read More »ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
Read More »క్లౌడ్ బరస్ట్‌పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్ బరస్ట్‌పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారు. కుట్రలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో లడాఖ్, లేహ్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ …
Read More »ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేదపండితులు, ఆలయ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని భద్రాచలంలోని గోదావరి ముంపు బాధితులను పరామర్శిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ. 1000 కోట్లతో కొత్త …
Read More »తెలంగాణ గురించి 8ఏండ్ల తర్వాత కండ్లు తెరిచిన మోదీ సర్కారు
తెలంగాణ రాష్ట్రమేర్పడిన దాదాపు 8ఏండ్ల తర్వాత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచింది. అందులో భాగంగా రేపటి జరగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన గిరిజన వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. రేపటి పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను కేంద్రంలోని మోదీ సర్కారు ప్రవేశపెట్టనుంది. అయితే తెలంగాణలో కేంద్ర గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర యూనివర్సిటీల సవరణ బిల్లు-2022ను తీసుకురానున్నట్లు …
Read More »ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. వరదల కారణంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగిందని.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను, అన్నదాతలను ఆదుకునేలా రాష్ట్రానికి సాయం చేయాలని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .
Read More »IIIT విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి హరీశ్‌రావు
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును స్పందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, కలెక్టర్, జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను పంపడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
Read More »