పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. . విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
Read More »యూపీలో ఘోర ప్రమాదం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఘజియాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ మీరట్ ఎక్స్ ప్రెస్ హైవే పై కారు బస్సు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ సంఘటనలో ఎనిమిదేండ్ల చిన్నారి కూడా గాయపడింది. చికిత్సకోసం అసుపత్రికి ఆ చిన్నారిని తరలించారు. అయితే బస్సు మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం …
Read More »ఇద్దరు దొంగల మధ్యలో ఓ ఫేక్ లేడీ పోలీస్
ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్‌షిప్‌లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది. చివరికి నకిలీ పోలీస్ అవతారం ఎత్తి కిలేడీగా మారింది. ఆమె ఆటలు పసిగట్టిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకెళితే.. గుడిసెల అశ్విని ఇంటర్ వరకు చదివి, ఇండ్లలో దొంగతనాలు చేసే రోహిత్‌శర్మ అనే ఒక …
Read More »ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
తనని ఫోన్ మాట్లాడవద్దని తల్లి వారించటంతో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ PS పరిధిలో జరిగింది. ఒడిస్సాకు చెందిన మేనక నాయక్, భర్త మున్నా నాయక్ల కుమారుడు అనిల్ కొంతకాలంగా తరచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి వద్దని వారించింది. మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో అనిల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More »ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని భవ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు వినయ్ మోసం చేశాడని ఇటీవల ఆమె గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసింది. అయితే పంచాయితీ నిర్వహించిన పెద్దలు.. రూ.5లక్షలు తీసుకుని విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన భవ్య సూసైడ్ చేసుకుంది. కుటుంబీకులు ఆమె మృతదేహంతో వినయ్ ఇంటి ముందు ఆందోళనకు
Read More »అప్సర హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయం
సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ అతడితో విభేదాల కారణంగా ఏడాది కింద సరూర్ నగర్లోని పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇంటి సమీపంలోని ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తేవడంతో సాయికృష్ణ ఆమెను చంపేశాడు.
Read More »అప్సర హత్య కేసులో ట్విస్ట్
అప్సరను హత్య చేసిన పూజారి సాయికృష్ణ నిన్న శంషాబాద్ పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటా. జైలుకు వెళ్లినా బతకను. అప్సరను చంపే ఉద్దేశం నాకు లేదు. పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది. లేకపోతే ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించింది’ అని విలపిస్తూ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అతడికి రాజేంద్రనగర్ కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.
Read More »వరంగల్ జిల్లాలో మరో దారుణం
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.. ఈ క్రమంలో వరంగల్ లో బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తను ప్రేమించిన వ్యక్తితో దిగిన ఫొటోలను అతను మరొకరికి పంపడం, వాటితో బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆమె ఉరేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ భూపాలపల్లికి చెందినవారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో …
Read More »పెను విషాదం.. అందరూ చూస్తుండగానే ప్రేమికులు
రైలు బయలుదేరిన కాసేపటికి ఓ ప్రేమ జంట అందులో నుంచి దూకేసింది. ఈ హఠాత్పరిణామానికి రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చెన్నై బీచ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ప్రేమికుల్లో యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కో పైలట్ రైలును తక్షణమే ఆపేశాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు …
Read More »జమ్మికుంటలో కలకలం
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో ఓ హృదయ విధాకర ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలు ఇంజిన్ కి ఓ మృతదేహం చిక్కుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జమ్ము వెళ్తున్న అండమాన్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ కి ఓ మృతదేహం చిక్కుకుని కనిపించింది. రైలు జమ్మికుంట స్టేషన్ కి రాగానే రైలు నడుపుతున్న లోకో పైలట్ మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే రైలును ఆపేశాడు. మృతదేహాన్ని రైలు ఇంజిన్ నుంచి విడదీశారు.మృతుడు …
Read More »