Home / Tag Archives: film news (page 189)

Tag Archives: film news

మీడియాపై రియా చక్రవర్తి పోరాటం

భారతీయ సినీ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి 28 రోజుల పాటు ముంబైలోని బైకులా జైలులో ఉన్న హీరోయిన్‌ రియా చక్రవర్తి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియా చక్రవర్తి రివర్స్‌ ఎటాక్‌ చేయనున్నారు. తన పేరుని దెబ్బతీసేలా వార్తలను ప్రసారం చేసిన మీడియా ఏజెన్సీలపై న్యాయపరమైన చర్యలను తీసుకోవడానికి రియా సిద్ధమైనట్లు ఆమె లాయర్‌ సతీశ్‌ మనీషిండే తెలిపారు. “రియా …

Read More »

జగపతిబాబు సోదరుడికి చంపేస్తామంటూ బెదిరింపులు…

సినీ నటుడు జగపతిబాబు సోదరుడిని బెదిరిస్తున్నాడో వ్యక్తి.. ఫిలింనగర్‌లో నివసించే జగపతిబాబు సోదరుడు యుగేంధ్ర కుమార్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌ వస్తున్నాయి.. . గుట్టల బేగంపేట స్థల విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి దాదాపు 25 ఫోన్ కాల్స్‌ వచ్చినట్టుగా చెబుతున్నారు.. యుగేంధ్ర కుమార్‌తోపాటు అతని కుమారుడిని కూడా చంపేస్తామని బెదిరించాడు శ్రీనివాస్‌. అయితే, ఈ బెదిరింపు కాల్స్ వెనుక.. వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి …

Read More »

క్రికెట్‌ దిగ్గజం బయోపిక్‌లో స్టార్‌ హీరో

శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌   జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ బయోపిక్‌కు సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది. ముత్తయ్య మురళీధరన్‌ పాత్రలో తమిళ హీరో  విజయ్‌ సేతుపతి నటింస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది. మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అప్‌డేట్ త్వ‌ర‌లోనే రానుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి …

Read More »

గ్రీన్‌ చాలెంజ్‌లో శేఖర్‌ కమ్ముల

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌  ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని ప్రముఖ దర్శకులు శేఖర్‌ కమ్ముల, కొరియోగ్రాఫర్‌  బాబాభాస్కర్‌లు స్వీకరించారు.కార్యక్రమంలో భాగంగా గురువారం మొయినాబాద్‌ మండలం కనకమామిడి గ్రామంలో జరుగుతున్న  ‘లవ్‌ స్టోరీ’ సినిమా షూటింగ్‌లో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌ కుమార్‌ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.  …

Read More »

సెక్స్ రాకెట్లో సంజనా ఉందా..? నిజమా..?

ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ మధ్యలో కోలీవుడ్ ను ఒక ఊపు ఊపుతున్న హాట్ టాపిక్ డ్రగ్స్ కేసు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర నుండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే వరకు అందరూ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్లు రాగిణీ ద్వివేది,సంజనా గల్ర్తానీలను అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా …

Read More »

చిరు పక్కన రమ్యకృష్ణ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా లూసిఫర్ మూవీలో ప్రముఖ నటి ముంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణతో చేయించాలని దర్శకుడు వినాయక్ ఆలోచిస్తున్నారని ఆ వార్తల సారాంశం. ఇందుకు దర్శకుడు …

Read More »

తమన్నాకు కరోనా

టాలీవుడ్ హాట్ బ్యూటీ మిల్క్ భామ తమన్నాకు కరోనా పాజిటీవ్ నిర్థారణ అయినట్లు తెలుస్తుంది. దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నగరంలోని వారం రోజులుగా హైటెక్ సిటీ సమీపంలోని ఒక ప్రముఖ హోటల్ లో జరుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గోంటున్నారు. గత రెండు రోజులుగా తీవ్రమైన తలనొప్పి,జ్వరంతో బాధపడుతున్న ఈ మిల్క్ …

Read More »

అందం గురించి గోవా భామ సంచలన వ్యాఖ్యలు

స్వీయలోపాల్ని తెలుసుకోవడంలోనే అసలైన విజ్ఞత, విజయరహస్యం దాగి ఉంటాయని చెబుతోంది గోవా భామ ఇలియానా. ఒకప్పుడు దక్షిణాదిన అగ్ర కథానాయికగా చలామణీ అయిన ఈ సొగసరి ప్రస్తుతం కెరీర్‌లో పూర్తిగా వెనకబడిపోయింది. తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ఈ అమ్మడు అందం గురించి ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ చేసింది. చూసే కళ్లను బట్టి అందానికి సంబంధించిన దృష్టికోణం మారిపోతుందని వివరించింది. ‘కెరీర్‌ ఆరంభంలో నా శరీరసౌష్టవాన్ని చూసి ఎప్పుడు బాధపడేదాన్ని. అవయవాల …

Read More »

అభిమానులపై రష్మిక పొగడ్తల వర్షం

తెలుగు చిత్రసీమలో క్రమంగా షూటింగ్‌ల సందడి మొదలవుతోంది. లాక్‌డౌన్‌కు మందు ఆగిపోయిన అగ్రతారల చిత్రాలు కూడా పునఃప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నుంచి తాను షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కెరీర్‌ ఆరంభం నుంచి అభిమానులు తనపై అంతులేని ప్రేమను చూపిస్తున్నారని..వారి ఆత్మీయతకు వెలకట్టలేనని ఆనందం వ్యక్తం చేసింది. తన అభిమానగణానికి ‘రోషియన్స్‌’ అని పేరు పెడుతున్నట్లు …

Read More »

ఆర్‌ఆర్‌ఆర్‌ నటులకు 14 రోజుల క్వారంటైన్‌!

ప్రపంచాన్ని గడగడలాడించిన  కరోనా దెబ్బతో ఆగిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షెడ్యూల్స్‌ కొవిడ్‌ 19 వల్ల తల్లకిందులయ్యాయి. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్‌ మరింత ఆలస్యమవుతుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat