భారతీయ సినీ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి 28 రోజుల పాటు ముంబైలోని బైకులా జైలులో ఉన్న హీరోయిన్ రియా చక్రవర్తి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియా చక్రవర్తి రివర్స్ ఎటాక్ చేయనున్నారు.
తన పేరుని దెబ్బతీసేలా వార్తలను ప్రసారం చేసిన మీడియా ఏజెన్సీలపై న్యాయపరమైన చర్యలను తీసుకోవడానికి రియా సిద్ధమైనట్లు ఆమె లాయర్ సతీశ్ మనీషిండే తెలిపారు.
“రియా ఓ ఫైటర్.. ఆమె బెంగాల్ ఆడపులి. ఆమె పేరు చెక్కు చెదరదు. దాన్ని పాడు చేయాలని చూసిన మూర్ఖులపై ఆమె న్యాయపోరాటం చేస్తారు. దానికి సంబంధించిన చర్యలతో ముందుకెళతాం” అన్నారు సతీశ్.
ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న రియా చక్రవర్తి, ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు తన పాస్‌పోర్టును అప్పగించారు. పదిరోజులకొకసారి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడానికి అంగీకరించారు.