Home / Tag Archives: gandhi hospital

Tag Archives: gandhi hospital

గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా

సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీశారు. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం తాను హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని చెప్పారు. గాంధీ దవాఖానలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. …

Read More »

గాంధీ దవాఖానలో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‎ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన హాస్పిటల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంతో దవాఖానలోని పలు వార్డుల్లోకి పొగ వ్యాపించింది. దీంతో రోగులు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన …

Read More »

రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి బయట మల్కాజీగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కరోనా బాధితుల వెంట వచ్చిన కుటుంబసభ్యులకు, బంధువులకు లాక్డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 1,000 మంది కడుపు నింపుతామని చెప్పారు. గాంధీ ఆస్పత్రి స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందికీ అన్నం పెడతామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో …

Read More »

కరోనా చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి నయం..మంత్రి కేటీఆర్‌ !

గాంధీ  ఆస్పత్రి  ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి పూర్తిగా నయమైందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  రాష్ట్రంలో  ఇప్పటి వరకు  67 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇటీవల కరోనా సోకడంతో  చికిత్స పొందుతున్న 11 బాధితులకు  తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని  కేటీఆర్‌ ట్విటర్లో పేర్కొన్నారు.  వీరందరిని ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో  జీహెచ్‌ఎంసీ పరిధిలో 145 …

Read More »

తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. బ్రిటన్ దేశం నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు రీపోర్ట్ వచ్చిందని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటికే ఐదు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక వ్యక్తి కోలుకుని గాంధీ ఆస్పత్రి నుండి డిశార్జి అయ్యాడు.

Read More »

తెలంగాణలో మరో పాజిటివ్ కేసు..అప్రమత్తమైన యంత్రాంగం !

తెలంగాణలో మరో కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ కు చెందిన 24 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఈమె ఇటీవలే ఇటలీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. వచ్చిన తరువాత జ్వరంతో బాగా ఇబ్బంది పడడంతో గాంధీ ఆశుపత్రిలో చేరగా ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు కరోనా ఉన్నట్టు తెలిసింది. దాంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు వారి కుటుంబంలో అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అంతకకుండా …

Read More »

గాంధీ ఆసుపత్రికి కరోనా కిట్లు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. అది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దీనికి సంబంధించిన పలు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పంపిన కరోనా టెస్టింగ్ కిట్లు నిన్న శుక్రవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని గాంధీ అసుపత్రికి చేరాయి. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్న కరోనా అనుమానితులకు ఈ కిట్లతో పరీక్షలు చేస్తున్నారు. సస్పెక్టెడ్ కేసుల …

Read More »

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ భయం..

తెలంగాణలో స్వైన్‌ఫ్లూ భయం మొదలైంది.మరోమారు స్వైన్‌ఫ్లూ పంజా విసిరింది.రెండు రోజులుగా చలిగాలులు వీచడంతో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరిస్తుంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒక వృద్ధుడు మరణించాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్‌ జ్వరాలు, డెంగ్యూలాంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య రెండ్రోజులుగా గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం.ప్రజలు భయందోనలో ఉన్నారు.

Read More »

అన్నపూర్ణ స్టూడియోలో హత్య..!

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్టూడియోలో పనిచేస్తున్న నారాయణరెడ్డి(53) మృతిచెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే విషయం బయటకు పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఎవరైనా హత్యచేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి …

Read More »