Home / TELANGANA / కరోనా చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి నయం..మంత్రి కేటీఆర్‌ !

కరోనా చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి నయం..మంత్రి కేటీఆర్‌ !

గాంధీ  ఆస్పత్రి  ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి పూర్తిగా నయమైందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  రాష్ట్రంలో  ఇప్పటి వరకు  67 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇటీవల కరోనా సోకడంతో  చికిత్స పొందుతున్న 11 బాధితులకు  తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని  కేటీఆర్‌ ట్విటర్లో పేర్కొన్నారు.  వీరందరిని ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు.
లాక్‌డౌన్‌ నేపథ్యంలో  జీహెచ్‌ఎంసీ పరిధిలో 145 మొబైల్‌ రైతు బజార్లను ప్రారంభించామని కేటీఆర్‌ తెలిపారు. వీటి ద్వారా పౌరులకు వారి ఇంటి వద్దకే వెళ్లి కూరగాయలను సరఫరా చేస్తున్నారని చెప్పారు. మొబైల్‌ వాహనాల వద్ద కొనుగోలు దారులు సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో  వీటి సంఖ్యను  పెంచబోతున్నామని వివరించారు.