Home / Tag Archives: international

Tag Archives: international

తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. 2 రోజులు గాల్లోనే రైతు..!

హైడ్రోజన్ బెలూన్ తాడు తెగి ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే ఉన్న ఘటన ఈశాన్య చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో జరిగింది. హైడ్రోజన్ బెలూన్ సాయంతో ఇద్దరు రైతులు చెట్ల నుంచి పైన్ కాయలు కోస్తుండగా ఉన్నట్టుండి దాని తాడు తెగింది. ఆ టైంలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కిందకు దూకేశాడు. హు అనే మరో వ్యక్తి మాత్రం అందులోనే చిక్కుకున్నాడు. బెలూన్ నుంచి కిందకి దూకిన …

Read More »

డొనాల్డ్ ట్రంప్ నివాసంపై FBI దాడులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దాడులు చేసింది. ఫ్లోరిడాలోని తన ఇల్లు ప్రస్తుతం FBI ఏజెంట్ల ముట్టడిలో ఉందని ట్రంప్ తెలిపారు. కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. అయితే సోదాల విషయం తెలిసి ట్రంప్ పలు కీలక డాక్యుమెంట్లను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Read More »

భారీ శాలరీతో కొత్త ఉద్యోగంలో చేరిన ఓ యువతికి భారీ షాక్

అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరానికి చెందిన లెక్సీ లార్సన్ గతంలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ఇటీవలే ఆమె టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన జాబ్‌లో చేరింది. తనకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో వివరిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన శాలరీ, ఇతర వివరాలు కూడా వెల్లడించింది. ఒకప్పుడు 70 వేల డాలర్లు సంపాదించే తనకు ప్రస్తుతం 90 వేల డాలర్లు వస్తోందని పేర్కొంది. ఈ వీడియో …

Read More »

డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అని ట్రంప్ ట్వీట్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొనలేదు. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటి మార్గాను ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. 1999లో ఆమెను వదిలేసి, 2005లో మెలానియా ట్రంపు పెళ్లాడారు.

Read More »

69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు పుతిన్ 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నట్లు జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానల్ వెల్లడించింది. ఆయన ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని పేర్కొంది. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్లగా తేలిందని తెలిపింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కొడుకులున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటపడకుండా ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్లో కొన్నేళ్లపాటు ఉంచారు.

Read More »

కేన్‌ విలియమ్సన్‌ కి కరోనా పాజిటీవ్

న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కొవిడ్‌ బారిన పడ్డాడు.మొన్న శుక్రవారం ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలియమ్సన్‌ పాజిటివ్‌గా తేలినట్టు కివీస్‌ జట్టు కోచ్‌ గ్యారీ స్టెడ్‌ తెలిపాడు. దీంతో కేన్‌ తాజా టెస్టుకు దూరమయ్యాడు.. అతని గైర్హాజరీతో మ్యాచ్‌కు టామ్‌ లాథమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, విలియమ్సన్‌ స్థానంలో హమిష్‌ రూథర్‌ఫర్డ్‌ జట్టులోకి వచ్చాడు. 

Read More »

అత్యంత విషమంగా ముషారఫ్‌ ఆరోగ్యం..

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ హెల్త్‌ కండిషన్‌ ఏమాత్రం బాగోలేదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిరోజులుగా దుబాయ్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమించినట్లు హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ముషారఫ్‌కు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌ ఆర్మీలో చేరి అంచెలంచెలుగా ముషారఫ్‌ ఎదిగారు. ఆ తర్వాత ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు.

Read More »

ఘోరం.. బిల్డింగ్‌ కింద సుమారు 200 డెడ్‌బాడీలు..

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని చాలా పట్టణాలు, నగరాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పోర్ట్‌ సిటీ మేరియుపోల్‌ తీవ్రంగా నష్టపోయింది. మూడునెలలుగా రష్యా జరుపుతున్న దాడిలో వందలాది మంది చనిపోయారు. ఆ నగరంలో తాజాగా భయానక వాతావరణం నెలకొంది. కూలిపోయిన ఓ భవనం కింద సుమారు 200 డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. భవనం శిథిలాలను కార్మికులు తొలగిస్తుండగా మృతదేహాలను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. డెడ్‌బాడీలు కుళ్లిపోయిన స్థితిలో …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

 దేశంలో రోజువారీ కరోనా  కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 4,25,89,841 మంది కోలుకోగా, 5,24,303 మంది మరణించారు. ఇంకా 15,419 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా, 2582 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

Read More »

ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో కొత్త వైరస్ -అమెరికాలో తొలి కేసు న‌మోదు

అమెరికాలో మంకీపాక్స్ వైర‌స్ కేసు న‌మోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ ఈ కేసును ద్రువీక‌రించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్య‌క్తికి ఈ వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అయితే ఆ వ్య‌క్తి ఇటీవ‌ల కెన‌డాలో ప‌ర్య‌టించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అత‌న్ని మ‌సాచుసెట్స్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. కెన‌డాలోని క్యూబెక్ ప్రావిన్సులో డ‌జ‌న్ల సంఖ్య‌లో ఇలాంటి కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. మంకీపాక్స్‌ను సీరియ‌స్ వైర‌స్ కేసుగా …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri