ఒడిశాలో మరో రష్యా వ్యక్తి శవమై తేలాడు. గత 15 రోజుల్లో ఆ దేశానికి చెందిన మూడో వ్యక్తి ఒడిశాలో మరణించాడు. అతన్ని మిల్యకోవ్ సెర్గీగా గుర్తించారు. జగత్సింగ్‌పుర్ జిల్లాలోని పారాదీప్ పోర్టు వద్ద ఉన్న ఓ షిప్‌లో అతన్ని మృతదేహాన్ని పసికట్టారు. బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్ నుంచి పారాదీప్ మీదుగా ఆ నౌక ముంబై వెళ్తోంది. ఆ షిప్‌లో సెర్గీ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్నారు.ఇవాళ ఉదయం 4.30 నిమిషాలకు షిప్‌లోని చాంబర్‌లో అతని మృతదేహాన్ని గుర్తించారు. రష్యన్ ఇంజినీర్ మరణాన్ని పారాదీప్ పోస్టు ట్రస్టు చైర్మన్ పీఎల్ హరానాథ్ కన్ఫర్మ్ చేశారు. విచారణ కొనసాగుతోందన్నారు. రెండు వారాల క్రితం ఒడిశాలోని రాయ్‌గడ్ జిల్లాలో ఓ రష్యన్ ఎంపీతో పాటు మరో వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే.
![](https://www.dharuvu.com/wp-content/uploads/2023/01/odisa-660x330.jpg)